INDW vs BANW Women’s T20 WC Highlights: బంగ్లాను చిత్తు చేసిన భారత్.. సెమీస్ సజీవం..

INDW vs BANW, Women’s T20 World Cup 2026 Highlights Updates: మహిళల టీ20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ భారత్‌కు 137 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మాంచెస్టర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.

INDW vs BANW Women’s T20 WC Highlights: బంగ్లాను చిత్తు చేసిన భారత్.. సెమీస్ సజీవం..
Indw Vs Banw Live Blog

Updated on: Jun 25, 2026 | 10:26 PM

INDW vs BANW, Women’s T20 World Cup 2026 Highlights Updates: మహిళల టీ20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించిన భారత్, సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. గురువారం మాంచెస్టర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా, షెఫాలీ వర్మ 53, యస్తికా భాటియా 23 పరుగుల సహకారంతో భారత్ 16.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేరుకుంది.

ఇరుజట్ల ప్లేయింగ్ 11:

భారత మహిళలు (ప్లేయింగ్ XI): స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తికా భాటియా, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), రిచా ఘోష్ (w), దీప్తి శర్మ, రాధా యాదవ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్, నందిని శర్మ.

బంగ్లాదేశ్ మహిళలు (ప్లేయింగ్ XI): దిలారా అక్టర్, జువైరియా ఫెర్దౌస్, షర్మిన్ అక్తర్, నిగర్ సుల్తానా(w/c), శోభనా మోస్తరీ, రీతు మోని, షోర్నా అక్టర్, రబెయా ఖాన్, నహిదా అక్టర్, శంజిదా అక్టర్ మేఘలా, మరుఫా అక్టర్.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 25 Jun 2026 10:13 PM (IST)

    భారత్ సెమీస్ ఆశలు సజీవం..

    భారత జట్టు బంగ్లాదేశ్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో హార్మన్ సేన సెమీస్ సేవలు సజీవంగా ఉంచుకుంది.

  • 25 Jun 2026 10:12 PM (IST)

    14 ఓవర్లకు..

    భారత్ 14 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. షఫాలీ వర్మ 53 పరుగులకు ఔటయింది.

  • 25 Jun 2026 09:32 PM (IST)

    2వ వికెట్ కోల్పోయిన భారత్..

    భారత్ 9 ఓవర్లలో 2 వికెట్లు నష్టానికి 76 పరుగులు చేసింది. స్మృతి మంధాన 8 పరుగుల వద్ద, షఫాలీ 53 పరుగులకు ఔటయ్యారు.

  • 25 Jun 2026 09:20 PM (IST)

    భారత్ 28 బంతుల్లో 50 పరుగులు

    137 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, భారత మహిళల జట్టు వేగంగా బ్యాటింగ్ చేసి, కేవలం 28 బంతుల్లోనే 4.4 ఓవర్లలో 50 పరుగులు సాధించింది.

  • 25 Jun 2026 09:19 PM (IST)

    ముగిసిన పవర్ ప్లే

    పవర్ ప్లే ముగిసే సరికి భారత జట్టు ఒక వికెట్ కోల్పోయి 63 పరుగులు చేసింది. షఫాలీ 45 పరుగులతో నాటౌట్ గా నిలిచింది.

  • 25 Jun 2026 09:04 PM (IST)

    3 ఓవర్లకు..

    3  ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు  1 వికెట్ కోల్పోయి 31  పరుగులు చేసింది.

  • 25 Jun 2026 08:40 PM (IST)

    టీమిండియా టార్గెట్ 137

    మహిళల టీ20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ భారత్‌కు 137 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మాంచెస్టర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.

  • 25 Jun 2026 08:20 PM (IST)

    18 ఓవర్లకు

    18 ఓవర్లలో బంగ్లాదేశ్ 4 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవడానికి భారత్‌కు ఈ మ్యాచ్ కీలకం.

  • 25 Jun 2026 07:45 PM (IST)

    4 క్యాచ్‌లు డ్రాప్

    కీలక మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు చెత్త ఫీల్డింగ్‌తో చిర్రెత్తిస్తున్నారు. నాలుగవ, ఐదవ ఓవర్ల మధ్య కేవలం నాలుగు బంతుల్లోనే మూడు క్యాచ్‌లు జారవిడవడంతో, తొలి వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ కోలుకోవడానికి అవకాశం లభించింది. సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవడానికి భారత్‌కు ఈ మ్యాచ్ కీలకం. మాంచెస్టర్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్, 9 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది.

  • 25 Jun 2026 07:25 PM (IST)

    6 ఓవర్లకు

    6 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ టీం ఒక వికెట్ కోల్పోయి 40 పరుగులు చేసింది.

  • 25 Jun 2026 06:42 PM (IST)

    బంగ్లాదేశ్ మహిళలు ప్లేయింగ్ XI:

    దిలారా అక్టర్, జువైరియా ఫెర్దౌస్, షర్మిన్ అక్తర్, నిగర్ సుల్తానా(కెప్టెన్, కీపర్), శోభనా మోస్తరీ, రీతు మోని, షోర్నా అక్టర్, రబెయా ఖాన్, నహిదా అక్టర్, శంజిదా అక్టర్ మేఘలా, మరుఫా అక్టర్.

  • 25 Jun 2026 06:41 PM (IST)

    భారత మహిళలు ప్లేయింగ్ XI:

    స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తికా భాటియా, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (కీపర్), దీప్తి శర్మ, రాధా యాదవ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్, నందిని శర్మ.

  • 25 Jun 2026 06:38 PM (IST)

    INDW vs BANW Women’s T20 WC Live Score: టాస్ ఓడిన భారత్..

    కీలక మ్యాచ్‌లో భారత జట్టు టాస్ ఓడిపోయింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

  • 25 Jun 2026 06:33 PM (IST)

    తప్పక గెలవాల్సిన మ్యాచ్..

    ఈ రెండు జట్లు టీ20ఐలలో 23 సార్లు తలపడగా, వాటిలో భారత్ 20 మ్యాచ్‌లు గెలవగా, బంగ్లాదేశ్ కేవలం మూడు మాత్రమే గెలుపొందింది.

Follow Us