IND vs BAN: టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ XIలో వారికి మొండిచేయి.. టెస్ట్ విజయాల పరంపరను కంటిన్యూ చేసేనా?

|

Dec 14, 2022 | 9:01 AM

బంగ్లాదేశ్‌తో ఇప్పటివరకు జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో భారత్‌కు మంచి రికార్డు ఉంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు మొత్తం 12 మ్యాచ్‌లు జరిగాయి. ఈ సమయంలో భారత్ 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

IND vs BAN: టాస్ గెలిచిన భారత్..  ప్లేయింగ్ XIలో వారికి మొండిచేయి.. టెస్ట్ విజయాల పరంపరను కంటిన్యూ చేసేనా?
India Vs Bangladesh, 1st Test
Follow us on

India Vs Bangladesh, 1st Test: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ చటోగ్రామ్‌లో జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు ముందు వన్డే సిరీస్‌లో భారత్ 1-2 తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆడడం లేదు. గాయం కారణంగా రోహిత్ తొలి టెస్ట్ నుంచి తప్పుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కేఎల్ రాహుల్ భారత జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు.

బంగ్లాదేశ్‌తో ఇప్పటివరకు జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో భారత్‌కు మంచి రికార్డు ఉంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు మొత్తం 12 మ్యాచ్‌లు జరిగాయి. ఈ సమయంలో భారత్ 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కాగా 2 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. బంగ్లాదేశ్ గడ్డపై కూడా టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. బంగ్లాదేశ్‌లో భారత్ 9 టెస్టు మ్యాచ్‌లు ఆడగా, 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కాగా 2 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

ఇరు జట్లు:

బంగ్లాదేశ్ ప్లేయింగ్ XI: జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, లిట్టన్ దాస్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్, యాసిర్ అలీ, నూరుల్ హసన్(కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, ఖలీద్ అహ్మద్, ఎబాడోత్ హొస్సేన్

భారత్ ప్లేయింగ్ XI: శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్(కెప్టెన్), ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్