India vs Bangladesh, 2nd T20I: రెండో టీ20లో బంగ్లాదేశ్‌కు 222 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. భారత జట్టులో నితీష్ రెడ్డి 74 పరుగులు, రింకూ సింగ్ 53 పరుగులతో టాప్ స్కోరర్స్‌గా నిలిచారు. హార్దిక్ పాండ్యా 19 బంతుల్లో 32 పరుగులు చేశాడు.
బంగ్లాదేశ్ తరపున రిషాద్ హుస్సేన్ 3 వికెట్లు తీశాడు. తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, తంజిమ్ హసన్ సాకిబ్ తలో వికెట్ తీశారు.
రెండు జట్ల ప్లేయింగ్-11..
Innings Break!
Half-centuries from Nitish Kumar Reddy(74) and Rinku Singh(53) and quick-fire knocks by Hardik Pandya and Riyan Parag, propel #TeamIndia to a total of 221/9.
Scorecard – https://t.co/Otw9CpO67y… #INDvBAN@IDFCFIRSTBank pic.twitter.com/JTDcEsaHqg
— BCCI (@BCCI) October 9, 2024
భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్.
బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), పర్వేజ్ హసన్ ఎమోన్, లిటన్ దాస్ (వికెట్ కీపర్), జాకర్ అలీ, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, మెహదీ హసన్ మిరాజ్, రిషాద్ హొస్సేన్, మస్తాఫిజుర్ రెహమాన్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ షకీబ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..