India vs Australia T20I Series: సెప్టెంబర్ 20 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం, భారత్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను జట్టులో చేర్చుకుంది. గతంలో బుమ్రా ఆసియా కప్ 2022లో ఆడలేదు. గాయం కారణంగా అతను టీమ్ ఇండియాకు దూరమయ్యాడు. అయితే ఇప్పుడు అతను ఫిట్‌గా ఉండటంతో ఆస్ట్రేలియాతో బరిలోకి దిగనున్నాడు. ఆస్ట్రేలియాపై బుమ్రాకు మంచి రికార్డు ఉంది. ఈ సిరీస్‌లో అతను పాకిస్థాన్‌కు చెందిన సయీద్ అజ్మల్ రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యాడు.
భారత్ తరపున ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా బుమ్రా రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు 15 వికెట్లు తీశాడు. ఈ విషయంలో సయీద్ అజ్మల్ మొదటి స్థానంలో ఉన్నాడు. 19 వికెట్లు తీశాడు. మహ్మద్ అమీర్ 17 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఉమర్ గుల్, ఇష్ సోధి తలో 16 వికెట్లు పడగొట్టారు. ఈ సిరీస్‌లో అజ్మల్ రికార్డును బుమ్రా బ్రేక్ చేసే అవకాశం ఉంది. అయితే, ఇందులో బుమ్రాకు 5 వికెట్లు అవసరం.
బుమ్రా టీ20 కెరీర్‌ను పరిశీలిస్తే.. అతను ఎఫెక్టివ్‌గా రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 58 మ్యాచుల్లో 69 వికెట్లు పడగొట్టాడు. ఈ సమయంలో బుమ్రా అత్యుత్తమ ప్రదర్శన 11 పరుగులిచ్చి 3 వికెట్లు తీయడం. ఐపీఎల్‌లో 120 మ్యాచ్‌లు ఆడి 145 వికెట్లు తీశాడు.
బుమ్రాతో పాటు భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్‌లకు కూడా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు అవకాశం దక్కడం గమనార్హం. టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టులో మహమ్మద్ షమీకి చోటు దక్కలేదు. కానీ, షమీని స్టాండ్ బై ప్టేయర్‌గా ఉంచారు.