India vs Australia Highlights, 3rd Test Day 4: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య గబ్బా స్టేడియంలో మూడో టెస్టు జరుగుతోంది. నేడు నాలుగో రోజు ఆట పూర్తియింది. 4వ రోజు ముగిసే సరికి భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 252 పరుగులు చేసింది. జస్ప్రీత్ బుమ్రా 10, ఆకాశ్ దీప్ 27 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. దీంతో భారత జట్టు ఫాలో ఆన్ ముప్పును కూడా దాటేసింది. ఇక ఐదో రోజు డ్రా చేసుకునే ఛాన్స్ భారత జట్టు ముందుంది.
77 పరుగుల వద్ద రవీంద్ర జడేజా ఔటయ్యాడు. అతను పాట్ కమిన్స్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ చేతికి చిక్కాడు. నితీష్ రెడ్డి (16 పరుగులు), కెప్టెన్ రోహిత్ శర్మ (10 పరుగులు)లను కూడా అవుట్ చేశాడు. మహ్మద్ సిరాజ్ (1 పరుగు)ను మిచెల్ స్టార్క్ పెవిలియన్‌కు పంపాడు. కేఎల్ రాహుల్ (84 పరుగులు) నాథన్ లియాన్‌కు బలయ్యాడు.
Akash Deep makes sure India avoid the follow-on and then smashes Pat Cummins into the second level!#AUSvIND pic.twitter.com/HIu86M7BNW
— cricket.com.au (@cricketcomau) December 17, 2024
కాగా, భారత జట్టు 51/4 స్కోరుతో ఉదయం ఆట ప్రారంభించింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసింది. శనివారం మొదలైన మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే.
కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా మాత్రమే టీమ్ ఇండియా గౌరవాన్ని కాపాడారు. రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 139 బంతుల్లో 84 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా 123 బంతుల్లో 77 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ 115 బంతుల్లో 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా టీమిండియా స్కోరును 200 దాటించారు.
CELEBRATIONS STARTED IN THE INDIAN DRESSING ROOM AS BUMRAH AND AKASHDEEP AVOIDED FOLLOW ON. pic.twitter.com/6hUkEAt12K
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 17, 2024
నాలుగో రోజు చివరి ఓవర్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ వేసిన బంతిని ఆకాశ్‌దీప్ ఫోర్ కొట్టి జట్టు స్కోరు 245 పరుగులకు చేరుకోవడంతో భారత డ్రెస్సింగ్ రూమ్‌లో ఆనందం వెల్లివిరిసింది. విరాట్ కోహ్లి ఘనంగా సంబరాలు చేసుకోవడం ప్రారంభించాడు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కూడా చాలా సంతోషంగా కనిపించి గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఆ తర్వాత ఆకాశ్‌దీప్, పాట్ కమిన్స్ వేసిన బంతికి భారీ సిక్సర్ బాదడంతో విరాట్ కోహ్లి ఆనందం కచ్చితంగా చూడాల్సిందే.
Stumps on Day 4 in Brisbane!
A fighting day with the bat 👏👏#TeamIndia move to 252/9, trail by 193 runs
A gripping Day 5 of Test cricket awaits tomorrow
Scorecard – https://t.co/dcdiT9NAoa#AUSvIND pic.twitter.com/QxCJkN3RR8
— BCCI (@BCCI) December 17, 2024
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ రెడ్డి, ఆకాష్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా మరియు మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హేజిల్‌వుడ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..