
India vs Australia 2nd Test Day 2: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ డే-నైట్ టెస్ట్‌లో శనివారం రెండో రోజు మొదలైంది. కాగా, తొలిరోజు ఆటముగిసే సమయానికి ఆస్ట్రేలియా కేవలం ఒక వికెట్ కోల్పోయి 86 పరుగులు చేసింది. నాథన్ మెక్‌స్వీనీ 38 పరుగులతో నాటౌట్‌గా ఉండగా, మార్నస్ లాబుషాగ్నే 20 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. భారత్ నుంచి జస్ప్రీత్ బుమ్రా ఏకైక వికెట్ పడగొట్టాడు.
అంతకుముందు భారత జట్టు 180 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా తరపున మిచెల్ స్టార్క్ 6 వికెట్లు పడగొట్టాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే.
ఆడిన మ్యాచ్‌లు: 7
గెలిచింది: 7
చివరి ఫలితం: 419 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది (2022)
అత్యధిక స్కోరు: 589/3d vs పాకిస్థాన్ (2019)
అత్యల్ప స్కోరు: 191 vs భారతదేశం (2020)
అత్యధిక వ్యక్తిగత స్కోరు: డేవిడ్ వార్నర్ 335* vs పాకిస్థాన్ (2019)
బెస్ట్ బౌలింగ్ స్పెల్: మిచెల్ స్టార్క్ 6/48 vs ఇండియా (2024)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), నాథన్ మెక్‌స్వీనీ, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..