IND vs AUS Toss Prediction Poll: ఫైనల్లో రోహిత్ శర్మ టాస్ గెలిస్తే ఏం ఎంచుకోవాలి.. మీ అభిప్రాయం ఏంటి?
ICC World Cup 2023: క్రికెట్ ప్రపంచ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న వన్డే ప్రపంచకప్ ఫైనల్ దగ్గరపడింది. ట్రోఫీ పోరులో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా పోటీ పడేందుకు సిద్ధమయ్యాయి. ఈమేరకు ఇరుజట్లు తుది సన్నాహాలు ప్రారంభించాయి. మరోవైపు అభిమానులు రోహిత్ సేన ట్రోఫీ గెలవాలంటూ పూజలు, యాగాలు చేస్తున్నారు. 11 ఏళ్ల తర్వాత మరోసారి ఐసీసీ ట్రోఫీని గెలవాలని యావత్ భారత్ కోరుకుంటోంది. అలాగే ఈ మ్యాచ్ కోసం బీసీసీఐ, ఐసీసీ కూడా ప్రత్యేకంగా ముగింపు వేడుకలను ప్లాన్ చేసింది.

IND vs AUS Toss Prediction Poll: : క్రికెట్ ప్రపంచ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న వన్డే ప్రపంచకప్ ఫైనల్ దగ్గరపడింది. ట్రోఫీ పోరులో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా పోటీ పడేందుకు సిద్ధమయ్యాయి. ఈమేరకు ఇరుజట్లు తుది సన్నాహాలు ప్రారంభించాయి. మరోవైపు అభిమానులు రోహిత్ సేన ట్రోఫీ గెలవాలంటూ పూజలు, యాగాలు చేస్తున్నారు. 11 ఏళ్ల తర్వాత మరోసారి ఐసీసీ ట్రోఫీని గెలవాలని యావత్ భారత్ కోరుకుంటోంది. అలాగే ఈ మ్యాచ్ కోసం బీసీసీఐ, ఐసీసీ కూడా ప్రత్యేకంగా ముగింపు వేడుకలను ప్లాన్ చేసింది.
మరి ఇంతటి మ్యాచ్‌లో టాస్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే, టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్లేనని అంటుంటారు. మరి ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిస్తే, టీమిండియా సారథి రోహిత్ శర్మ ఏం ఎంచుకోవాలి? ఇప్పటికే క్రికెట్ నిపుణులు, మాజీలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. మరి టాస్ గెలిస్తే భారత సారథి రోహిత్ శర్మ ఏం ఎంచుకోవాలని కోరుకుంటున్నారు? మీ అభిప్రాయం కింది పోల్ ద్వారా చెప్పేయండి మరి..
ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్లో ఇండియా టాస్ గెలిస్తే ఏం ఎంచుకోవాలి?#ICCWorldCup2023 #INDvsAUSfinal #WorldcupFinal
— TV9 Telugu (@TV9Telugu) November 18, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




