AUS vs IND: 3 దశాబ్దాల తర్వాత ఎంతో స్పెషల్‌గా భారత్, ఆసీస్ సిరీస్.. అదేంటో తెలుసా?
India vs Australia: చివరిసారిగా 1991-92 ఆస్ట్రేలియా పర్యటనలో భారత్-ఆస్ట్రేలియా మధ్య 5 టెస్టుల సిరీస్ జరిగింది. ఈ టీమ్ ఇండియా పర్యటనలో షేన్ వార్న్ అరంగేట్రం చేశాడు. ఆ టూర్‌లో ఆడిన ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 4-0తో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఇరు జట్లు 2024-25లో మొదటిసారి 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడబోతున్నాయి.
India vs Australia: 2024-25లో ఆస్ట్రేలియా పర్యటన టీమిండియాకు ప్రత్యేకం. ఎందుకంటే గత 3 దశాబ్దాల క్రితం జరిగిన అలాంటిదే ఈసారి జరగనుంది. అదేంటంటే.. టీమ్ ఇండియాలోని ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అందులో భాగం కాలేదు. ఆ సమయంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య చివరి 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరిగినప్పుడు, రోహిత్ శర్మ వయస్సు కేవలం 5 సంవత్సరాలు, విరాట్ కోహ్లీ వయస్సు 4 సంవత్సరాలు కావడం గమనార్హం.
చరిత్ర సృష్టించిన భారత్-ఆస్ట్రేలియా.. 32 ఏళ్ల తర్వాత మళ్లీ అలా..
చివరిసారిగా 1991-92 ఆస్ట్రేలియా పర్యటనలో భారత్-ఆస్ట్రేలియా మధ్య 5 టెస్టుల సిరీస్ జరిగింది. ఈ టీమ్ ఇండియా పర్యటనలో షేన్ వార్న్ అరంగేట్రం చేశాడు. ఆ టూర్‌లో ఆడిన ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 4-0తో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఇరు జట్లు 2024-25లో మొదటిసారి 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడబోతున్నాయి.
32 ఏళ్ల తర్వాత మళ్లీ జరగనున్న 5 టెస్టుల సిరీస్ షెడ్యూల్ కూడా వెల్లడైంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో జరగనున్న ఈ పర్యటనలో 5 టెస్టుల సిరీస్ నవంబర్ 2024 నుంచి ప్రారంభమై జనవరి 2025 వరకు కొనసాగుతుంది. గత రెండు ఆస్ట్రేలియా పర్యటనల్లో టీమ్ ఇండియా సాధించిన విజయాల దృష్ట్యా, 5 టెస్టుల సిరీస్‌లో ఈ పర్యటనపై 1992 నాటి పరిస్థితికి భిన్నంగా జరగాలని అంతా కోరుకుంటున్నారు.
భారత ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్ ఎలా ఉంది?
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న టెస్టు సిరీస్ షెడ్యూల్‌ను ఒకసారి చూద్దాం.
మొదటి టెస్ట్: 22-26 నవంబర్, పెర్త్
రెండవ టెస్ట్: 6-10 డిసెంబర్, అడిలైడ్ (డే/నైట్)
మూడో టెస్టు: 14-18 డిసెంబర్, బ్రిస్బేన్
నాల్గవ టెస్ట్: 26-30 డిసెంబర్, మెల్బోర్న్
ఐదవ టెస్ట్: 3-7 జనవరి, సిడ్నీ
భారత్ వెలుపల టీమ్ ఇండియా రెండో డే-నైట్ టెస్ట్..
5 టెస్టుల సిరీస్‌లో ఒక టెస్టు మ్యాచ్ డే-నైట్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇక, ఈ మ్యాచ్ డిసెంబర్ 6 నుంచి 10 మధ్య అడిలైడ్‌లో జరగనుంది. భారత్ వెలుపల టీమ్ ఇండియాకు ఇది రెండో డే-నైట్ టెస్టు. దీనికి ముందు కూడా, ఆస్ట్రేలియాతో డే-నైట్ టెస్ట్ ఆడింది. అందులో భారత జట్టు ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..