India vs Australia, 5th Test Day 1 Highlights: ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 5వ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 185 పరుగులకు ఆలౌటైంది. శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఒక వికెట్ నష్టపోయి 9 పరుగులు చేసింది. 2 పరుగుల వద్ద ఉస్మాన్ ఖవాజా ఔటయ్యాడు. కాగా, తొలి రోజు ఆట ముగిసే సమయానికి సామ్ కొన్‌స్టాస్ 7 పరుగులతో నాటౌట్‌గా వెనుదిరిగాడు.
అంతకుముందు టాస్ గెలిచిన భారత జట్టు కేవలం 185 పరుగులకే ఆలౌట్ అయింది. టీమ్ ఇండియా తరపున రిషబ్ పంత్ అత్యధికంగా 40 పరుగులు చేశాడు. 26 పరుగుల వద్ద రవీంద్ర జడేజా ఔటయ్యాడు. శుభ్‌మన్ గిల్ 20 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 17 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్ 4 వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్ 3 వికెట్లు తీశాడు. పాట్ కమిన్స్ 2 వికెట్లు తీశాడు. నాథన్ లియాన్ ఖాతాలో ఒక వికెట్ చేరింది.
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో రోహిత్ శర్మ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చారు. అయితే గాయం కారణంగా ఆకాశ్ దీప్ ఈ మ్యాచ్ ఆడడం లేదు. శుభ్‌మన్ గిల్ తిరిగి రాగా, ప్రసిద్ధ్ కృష్ణకు అవకాశం లభించింది.
ABSOLUTE CINEMA IN SYDNEY. 🍿
– Sam Konstas involved in an argument with Bumrah.
– Bumrah removed Khawaja on the last ball.
– Team India totally fired up.
– Bumrah gives an ice cold stare to Konstas after the wicket. 🥶 pic.twitter.com/3us6V6c68J— Mufaddal Vohra (@mufaddal_vohra) January 3, 2025
భారత్: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్‌స్టాన్స్, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ (వికెట్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి