Virat Kohli Test Century: ముగిసిన 40 నెలల నిరీక్షణ.. కెరీర్‌లో 75వ సెంచరీ కొట్టిన రన్ మెషీన్..

India vs Australia 4th Test: 2019లో బంగ్లాదేశ్‌పై విరాట్‌ కోహ్లీ బ్యాట్‌ నుంచి చివరి టెస్టు సెంచరీ నమోదైంది.

Virat Kohli Test Century: ముగిసిన 40 నెలల నిరీక్షణ.. కెరీర్‌లో 75వ సెంచరీ కొట్టిన రన్ మెషీన్..
ఇక ఈ మ్యాచ్ విశేషమేమంటే కోహ్లీ దాదాపు 40 నెలల తర్వాత టెస్టు క్రికెట్‌లో తన సెంచరీని నాలుగో రోజు ఆటలో సాధించాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ 167వ ఓవర్ పూర్తయే సమయానికి మొత్తం 326 బంతులు ఆడిన కోహ్లీ 168 పరుగులతో నాటౌట్‌గా క్రీజులో ఉన్నాడు. ఇందులో 15 ఫోర్లు కూడా ఉన్నాయి. అలాగే కోహ్లీతో పాటు ప్రస్తుతం క్రీజులో అక్షర్ పటేల్(95 బంతుల్లో 50 పరుగులు; 4 ఫోర్లు, 1 సిక్సర్) ఉన్నాడు.

Updated on: Mar 12, 2023 | 1:50 PM

విరాట్ కోహ్లీతో పాటు ఫ్యాన్స్ మొత్తం నెలల తరబడి నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఆదివారంతో కోహ్లీ 75వ సెంచరీ కోసం యావత్ దేశం ఎదురు చూపులు ఫలించాయి. అహ్మదాబాద్‌ టెస్ట్‌లొ కెరీర్‌లో 75వ సెంచరీ బాదేశాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు నాలుగో రోజున విరాట్ ఈ ఘనత సాధించాడు. కోహ్లీకి ఇది 28వ టెస్టు సెంచరీ కాగా, గత 40 నెలలుగా టెస్టులో సెంచరీ కోసం ఎదురుచూస్తున్నాడు. కాగా, కోహ్లి తన చివరి టెస్టు సెంచరీని 2019లో బంగ్లాదేశ్‌పై సాధించాడు. అప్పటి నుంచి పరుగుల కరువుతో సతమతమవుతున్నాడు.

గత 40 నెలల్లో కోహ్లీకి ఇదే తొలి టెస్టు సెంచరీ. 241 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. 139వ ఓవర్ రెండో బంతికి కోహ్లీ సింగిల్ తీయగానే స్టేడియం మొత్తం హోరెత్తింది. కోహ్లి కూడా తన లాకెట్‌ను ముద్దాడి సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

టెండూల్కర్ తర్వాత రెండో బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్..

ఈ సెంచరీతో క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియాపై అత్యధిక శతకాలు సాధించిన రెండో బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. ఆసీస్‌పై ఇప్పటి వరకు 16 సెంచరీలు చేశాడు. భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ 20 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాపై అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన మూడో భారత బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు.

టెస్టుల్లో మూడో భారత ఆటగాడిగా కోహ్లీ..

ఆస్ట్రేలియాపై కోహ్లికి ఇది 8వ టెస్టు సెంచరీ. ఈ జట్టుపై సచిన్ టెండూల్కర్ అత్యధికంగా 11, సునీల్ గవాస్కర్ 8 టెస్టు సెంచరీలు సాధించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..