
India vs Afghanistan Head to Head Records: ప్రపంచకప్‌లో 9వ మ్యాచ్ అక్టోబర్ 11న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ (IND vs AFG) మధ్య జరగనుంది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించగా, అఫ్గానిస్థాన్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఓడిపోయింది. టీమ్ ఇండియా తన విజయాల పరంపరను కొనసాగించాలనుకుంటే, అఫ్గానిస్థాన్ కూడా ఎదురుదాడికి పూర్తిగా సిద్ధమవుతుంది.
ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ కూడా కనిపించడం లేదు. డెంగ్యూ జ్వరం నుంచి ఇంకా కోలుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మతో పాటు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఇషాన్ కిషన్ రంగంలోకి దిగనున్నాడు.
ప్రపంచకప్ చరిత్రలో, భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో ఒక్కసారి మాత్రమే తలపడింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచింది. వన్డే ఫార్మాట్‌లో కూడా, టీం ఇండియా 2 మ్యాచ్‌ల్లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించగా, ఒక మ్యాచ్ టై అయింది.
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
ఆఫ్ఘనిస్తాన్ : హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్, రహమత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్హాక్ ఫరూకీ, నవీన్-ఉల్-హక్.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ పిచ్ సాధారణంగా నెమ్మదిగా, స్పిన్ బౌలర్లకు సహాయకరంగా పరిగణిస్తుంటారు. కానీ, చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసి 428 పరుగులు చేసింది. అయితే, సాయంత్రం మంచు కనిపిస్తుంది. కొంచెం చలి ఉంటుంది. దీనిలో ఫాస్ట్ బౌలర్లకు ప్రారంభంలో అవకాశం లభిస్తుంది. తరువాత బ్యాట్స్‌మెన్‌లకు బ్యాటింగ్ చేయడం సులభం కావొచ్చు.
భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ మధ్యాహ్నం 1:30లక పడనుంది. స్టార్ స్పోర్ట్స్‌లో ఈ మ్యాచ్‌ని టీవీలో చూడవచ్చు. ఇది Disney+Hotstar యాప్‌లో ప్రసారం కానుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..