India tour of Sri Lanka: వన్డే, టీ20 సిరీస్ మ్యాచ్‌ల సమయాల్లో మార్పులు.. సవరించిన టైమింగ్స్ ఇవే..

India tour of Sri Lanka: టీమిండియా, శ్రీలంక మధ్య జరిగే వన్డే, టీ20 సిరీస్ సమయాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. తాజాగా దానికి సంబంధించిన షెడ్యూల్‌ను..

India tour of Sri Lanka: వన్డే, టీ20 సిరీస్ మ్యాచ్‌ల సమయాల్లో మార్పులు.. సవరించిన టైమింగ్స్ ఇవే..
Rahul Dravid

Updated on: Jul 12, 2021 | 11:56 PM

టీమిండియా, శ్రీలంక మధ్య జరిగే వన్డే, టీ20 సిరీస్ మ్యాచ్‌ల సమయాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. సాధారణంగా డే/నైట్  వన్డేలు మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా.. కాస్త వెనక్కి జరిపి మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే టీ20ల ప్రారంభ సమయాన్ని రాత్రి 7 గంటల నుంచి 8 గంటలకు మార్చారు. దీనికి సంబంధించిన వివరాలను శ్రీలంక క్రికెట్ బోర్డు ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది.

ఇదిలా ఉంటే కరోనా కారణంగా ఈ నెల 13 నుంచి మొదలు కావాల్సిన ఈ సిరీస్ ఐదు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుంది. జూలై 18న మొదటి వన్డే జరగనుంది. 20న రెండో వన్డే, 23న మూడో వన్డే జరగనుంది. అలాగే టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ జూలై 25న, 27న రెండో మ్యాచ్, 29న మూడో మ్యాచ్‌ను నిర్వహించనున్నారు.

కాగా, వన్డే, టీ20 సిరీస్‌లలోని అన్ని మ్యాచ్‌లు కొలంబో వేదికగా జరగనున్నాయి. టీమిండియాకు ఓపెనర్ శిఖర్ ధావన్ సారధ్య బాధ్యతలు చేపడుతున్నాడు. రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న టీమిండియా జట్టులో అందరూ యువ ప్లేయర్లు ఉండటం విశేషం. మొదటి శ్రేణి జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగా.. రెండో శ్రేణి జట్టు శ్రీలంకతో తలబడనుంది.

లంక టూర్‌కి భారత జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్య, నితీశ్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), యుజ్వేందర్ చాహల్, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చాహర్, నవదీప్ సైనీ, చేతన్ సకారియా

Also Read:

ఈ ఫోటోలో చిరుత నక్కింది.. గుర్తించండి చూద్దాం.. చాలామంది ఫెయిల్ అయ్యారు!

కోళ్ల వెంటబడ్డ పాము.. గోరింక మెరుపు దాడి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

ఏపీలో కర్ఫ్యూ ఆంక్షల్లో సడలింపులు.. అన్ని జిల్లాల్లో ఒకేలా అమలు.. ఎప్పటినుంచంటే.!