India vs New Zealand 2nd T20I Live Score: రాంచీలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో టీమ్ ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతోన్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీం తొలుత బ్యాటింగ్ చేసింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు సాధించింది. టీమిండియా ముందు 154 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. తప్పక గెలవాల్సిన మ్యాచులో న్యూజిలాండ్ టీం ఇన్నింగ్స్‌ను ధాటిగానే ఆరంభించింది. కివీస్ విధ్వంసకర ఆటగాడు మార్టిన్ గప్టిల్ (31 పరుగులు, 15 బంతులు, 3 ఫోర్లు, 2 సిక్సులు), అలాగే మరో ఓపెన్ డారిల్ మిచెల్ అద్భుతంగా ఆడి మొదటి 4 ఓవర్లలో బౌండరీల వర్షం కురించారు. అయితే దీపర్ చాహర్ బౌలింగ్‌లో కీపర్ రిషబ్ పంత్ అద్భుత క్యాచ్‌కు గప్టిల్ ఔటయ్యాడు. దీంతో న్యూజిలాండ్ టీం 4.2 ఓవర్లలో 48 పరుగుల భాగస్వామ్యం వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది.
ఈ మ్యాచులో మార్టిన్ గప్టిల్(3231) టీ 20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్స్‌గా నిలిచాడు. ఆ తరువాత స్థానాల్లో విరాట్ కోహ్లీ(3227), రోహిత్ శర్మ(3086), ఆరోన్ ఫించ్(2608), పాల్ స్టిర్లింగ్(2570) నిలిచారు. అనంతరం క్రీజులోకి వచ్చిన మార్క్ చాప్‌మన్‌తో కలిసి డారిల్ మిచెల్ కీలక భాగస్వామ్యాన్ని అందించాడు. అయితే ప్రమాదంలా మారుతున్న ఈ జోడీని అక్షర్ పటేల్ విడదీశాడు. మార్క్ చాప్‌మన్ (21 పరుగులు, 17 బంతులు, 3 ఫోర్లు) రెండో వికెట్‌గా పెవిలియన్ చేర్చి కీలక భాగస్వామ్యం ఏర్పడకుండా చేశాడు. దీంతో న్యూజిలాండ్ టీం 8.5 ఓవర్లలో 79 పరుగుల వద్ధ రెండో వికెట్‌ను కోల్పోయింది.
డారిల్ మిచెల్ (31, పరుగులు, 28 బంతులు, 3 ఫోర్లు) మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. డెబ్యూ మ్యాచులో హర్షల్ పటేల్ తన తొలి వికెట్‌ను పడగొట్టాడు. సూర్య కుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి ఓపెనర్ మిచెల్ ఔటయ్యాడు. దీంతో న్యూజిలాండ్ టీం 11.2 ఓవర్లలో 90 పరుగుల వద్ధ మూడో వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన టిమ్ సీపెర్ట్ (13 పరుగులు, 15 బంతులు)తో కలిసి గ్లెన్ ఫిలిప్స్ మరోసారి కీలక భాగస్వామ్యాన్ని ఏర్పరించేందుకు ప్రయత్నించారు. అయితే అశ్విన్ బౌలింగ్‌లో భువనేశ్వర్‌కు క్యాచ్ ఇచ్చి సీఫెర్ట్‌ను పెవిలియన్ చేర్చాడు. దీంతో న్యూజిలాండ్ టీం 15.1 ఓవర్లలో 125 పరుగుల వద్ధ నాలుగో వికెట్‌ను కోల్పోయింది. అనంతరం మరో కీలక ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ (34 పరుగులు, 21 బంతులు, ఫోర్, 3 సిక్సులు) ఐదో వికెట్‌గా హర్షల్ పటేల్ బౌలింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 16.3 ఓవర్లలో న్యూజిలాండ్ టీం 137 పరుగుల వద్ధ ఐదో వికెట్‌ను కోల్పోయింది. అనంతరం జేమ్స్ నీషమ్ (3) ఆరో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. భువనేశ్వర్ బౌలింగ్‌లో కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 17.6 ఓవర్లలో న్యూజిలాండ్ టీం 140 పరుగుల వద్ధ ఆరో వికెట్‌ను కోల్పోయింది. అనంతరం మిచెల్ సాంట్నర్ 8, ఆడమ్ మిల్నే 5 పరుగులతో మరో వికెట్ పడకుండా టీం స్కోర్‌ను 153 పరుగులకు చేర్చారు.
ఇక ఈ మ్యాచులో టీమిండియా బౌలర్లు తొలి 4 ఓవర్లో దారుణంగా విఫలమైనా, ఆ తరువాత నుంచి పుంజుకుని న్యూజిలాండ్‌ను కట్టడి చేశారు. టీమిండియా బౌలర్లలో హర్షల్ పటేల్ 2 వికెట్లు, దీపక్ చాహర్, అక్షర్ పటేల్, అశ్విన్, భువనేశ్వర్ తలో వికెట్ పడగొట్టారు.
ICYMI: @HarshalPatel23‘s first wicket in international cricket ? ?
Watch how the #TeamIndia debutant picked that scalp ? ? @Paytm #INDvNZ
— BCCI (@BCCI) November 19, 2021
భారత్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(కీపర్), శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫెర్ట్(కీపర్), జేమ్స్ నీషమ్, ఇష్ సోధి, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ(కెప్టెన్), ఆడమ్ మిల్నే, ట్రెంట్ బౌల్ట్
Also Read: రొటేషన్ పద్ధతి మనకు సరిపోదు.. బీసీసీఐ మరోసారి ఆలోచించాలి: భారత మాజీ కెప్టెన్ విమర్శలు