రోహిత్ ఇన్.. పంత్‌ ఔట్.. వెస్టిండీస్ సిరీస్‌కు భారత జట్టు.. ఇద్దరు కొత్తోళ్లకు చోటు!

India vs West Indies: వెస్టిండీస్‌తో త్వరలో ప్రారంభం కానున్న పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టును సెలెక్టర్లు అధికారికంగా ప్రకటించారు. వన్డే ఫార్మాట్ కోసం ఎంపిక చేసిన జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు స్థానం దక్కకపోగా, దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టిన ఇద్దరు యువ ప్లేయర్లకు తొలిసారి పిలుపునిచ్చారు.

రోహిత్ ఇన్.. పంత్‌ ఔట్.. వెస్టిండీస్ సిరీస్‌కు భారత జట్టు.. ఇద్దరు కొత్తోళ్లకు చోటు!
Team India Odi Team

Updated on: Sep 16, 2026 | 9:15 PM

వెస్టిండీస్ క్రికెట్ జట్టు (West Indies Cricket Team) తో జరగబోయే వన్డే, టీ20 సిరీస్‌ల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) బుధవారం సాయంత్రం జట్లను వెల్లడించింది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) పదవీకాలం పొడిగించకపోవడంతో ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఆఖరి ఎంపిక సమావేశం ఇదేననే వార్తల నేపథ్యంలో అందరి ఫోకస్ ఈ ప్రకటనపై పడింది. సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) వన్డే జట్టులో కొనసాగుతుండగా, స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) కు మాత్రం నిరాశే మిగిలింది. ఆయనను పక్కనబెట్టిన సెలెక్టర్లు బ్యాకప్ కీపర్‌గా ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) కు అవకాశం కల్పించారు. పంత్‌ను ఇరానీ కప్ (Irani Cup) లో రెస్ట్ ఆఫ్ ఇండియా (Rest of India) కెప్టెన్‌గా ఎంపిక చేశారు. మరోవైపు హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో జట్టులోకి రాలేదు.

సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 3 వరకు సాగే మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు శుభ్‌మన్ గిల్ (Shubman Gill) కెప్టెన్సీలో బరిలోకి దిగనుంది. ఆసియా క్రీడలు (Asian Games 2026) లో పాల్గొంటున్న కారణంగా శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer), జస్ప్రీత్ బుమ్రా ఈ వన్డే సిరీస్‌కు అందుబాటులో లేరు. దాంతో కేఎల్ రాహుల్ (KL Rahul) వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. సుదీర్ఘ విరామం అనంతరం సీనియర్ పేసర్ మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) వన్డే జట్టులోకి రాగా, పంజాబ్ ఆల్‌రౌండర్ నమన్ ధీర్ (Naman Dhir), జమ్మూ కశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ (Auqib Nabi) తొలిసారి వన్డే జట్టు పిలుపు అందుకున్నారు.

అక్టోబర్ 6 తేదీన ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఆసియా క్రీడలు ముగియడంతో శ్రేయస్ అయ్యర్ సారథిగా, తిలక్ వర్మ (Tilak Varma) వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ ఫార్మాట్‌లో బుమ్రాకు రెస్ట్ ఇవ్వగా, యువ పేసర్లు ప్రిన్స్ యాదవ్ (Prince Yadav), మయాంక్ యాదవ్ (Mayank Yadav) తిరిగి చోటు సంపాదించారు.

భారత వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, మహమ్మద్ సిరాజ్, ఆకిబ్ నబీ, యశస్వి జైస్వాల్, నమన్ ధీర్.

భారత టీ20 జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్.

Loading...
Unable to load recommendations.
Follow Us