IND vs SA : భారత క్రికెట్ చరిత్రలో చేదు అధ్యాయం.. 124 పరుగులు చేయలేక 3 అనవసర రికార్డులు

భారత క్రికెట్ చరిత్రలో కోల్‌కతా టెస్ట్ మ్యాచ్‌ను అభిమానులు గుర్తుంచుకుంటారు. సౌతాఫ్రికా జట్టు భారత్‌ను తొలి టెస్ట్‌లో 30 పరుగుల తేడాతో ఓడించి, రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. అంటే భారత్ ఇక ఈ సిరీస్‌ను గెలిచే అవకాశం లేదు. చివరి మ్యాచ్ గెలిచినా కేవలం డ్రా మాత్రమే చేయగలదు.

IND vs SA : భారత క్రికెట్ చరిత్రలో చేదు అధ్యాయం.. 124 పరుగులు చేయలేక 3 అనవసర రికార్డులు
Ind Vs Sa

Updated on: Nov 16, 2025 | 5:33 PM

IND vs SA : భారత క్రికెట్ చరిత్రలో కోల్‌కతా టెస్ట్ మ్యాచ్‌ను అభిమానులు గుర్తుంచుకుంటారు. సౌతాఫ్రికా జట్టు భారత్‌ను తొలి టెస్ట్‌లో 30 పరుగుల తేడాతో ఓడించి, రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. అంటే భారత్ ఇక ఈ సిరీస్‌ను గెలిచే అవకాశం లేదు. చివరి మ్యాచ్ గెలిచినా కేవలం డ్రా మాత్రమే చేయగలదు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవడానికి కేవలం 124 పరుగుల లక్ష్యం మాత్రమే ఉన్నా, టీమిండియా కేవలం 93 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ ఘోర పరాజయం కారణంగా భారత్ ఖాతాలో మూడు అనవసరమైన (అన్‌వాంటెడ్) రికార్డులు వచ్చి చేరాయి.

భారత్ నమోదు చేసిన 3 అనవసర రికార్డులు ఇవే

స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో రెండో ఫెయిల్యూర్

టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతి తక్కువ లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ విఫలమవ్వడం ఇది రెండోసారి. అంటే, ఇంతకంటే తక్కువ లక్ష్యం ఉన్నప్పుడు భారత్ ఇంతకుముందు కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే ఓడిపోయింది. దీని కంటే ముందు 1997లో వెస్టిండీస్‌తో బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌ భారత్‌కు అతిపెద్ద పరాజయాన్ని మిగిల్చింది. ఆ మ్యాచ్‌లో భారత్ గెలవడానికి కేవలం 120 పరుగుల టార్గెట్ ఉన్నా, ఆ లక్ష్యాన్ని అందుకోలేక ఓడిపోయింది. ఈ రెండు సందర్భాలు చిన్న లక్ష్యాలు కూడా అనుకూలించని పిచ్‌లపై లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎంత ప్రమాదకరంగా మారతాయో స్పష్టం చేస్తున్నాయి.

సౌతాఫ్రికాకు చిన్న స్కోర్‌ను కాపాడుకుని రెండో విజయం

సౌతాఫ్రికా జట్టు టెస్టుల్లో అతి తక్కువ స్కోర్‌ను కాపాడుకుని గెలవడం ఇది రెండోసారి. 1994లో ఆస్ట్రేలియాపై 117 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని గెలవగా, ఆ తర్వాత 124 పరుగులను కాపాడుకుని భారత్‌పై గెలిచింది.

భారతదేశంలో అతి తక్కువ లక్ష్యాన్ని కాపాడుకున్న రెండో విజయం

భారతదేశంలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లలో ప్రత్యర్థి జట్టు అతి తక్కువ లక్ష్యాన్ని కాపాడుకుని గెలవడం ఇది రెండోసారి. 2004లో ఆస్ట్రేలియా జట్టు వాంఖడేలో భారత్‌పై 107 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని గెలిచింది. దాని తర్వాత, సౌతాఫ్రికా 124 పరుగులను కాపాడుకుని కోల్‌కతాలో గెలిచింది.

మ్యాచ్ హీరో సైమన్ హార్మర్

ఈ సంచలన విజయానికి కారణం సౌతాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్. ఇతను ఈ టెస్ట్ మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌లలోనూ చెరో 4 వికెట్లు చొప్పున మొత్తం 8 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ధ్రువ్ జురెల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా వంటి కీలక బ్యాటర్లను అవుట్ చేసి భారత్‌ను దెబ్బతీశాడు. అలాగే, సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన హాఫ్ సెంచరీ (55 పరుగులు) చేసి, లక్ష్యాన్ని 100 పరుగుల మార్కు దాటించడంలో కీలక పాత్ర పోషించారు. హార్మర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..