రోహిత్ 264 పరుగుల భారీ రికార్డ్‌ను బ్రేక్ చేసిందెవరో తెలుసా.. షాక్ అవ్వాల్సిందే భయ్యో..?

తమిళనాడు జట్టు అరుణాచల్ ప్రదేశ్‌తో మొదట బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 506 పరుగులు చేసింది. తమిళనాడు తరపున ఓపెనర్ సాయి సుదర్శన్ 102 బంతుల్లో 154 పరుగులు చేశాడు. నారాయణ్ జగదీశన్ 141 బంతుల్లో 277 పరుగులు చేశాడు.

రోహిత్ 264 పరుగుల భారీ రికార్డ్‌ను బ్రేక్ చేసిందెవరో తెలుసా.. షాక్ అవ్వాల్సిందే భయ్యో..?
Rohit Sharma

Updated on: Aug 17, 2025 | 7:20 PM

క్రికెట్ మైదానంలో విధ్వంసం సృష్టించిన భారత బ్యాట్స్‌మన్ ‘వన్డే క్రికెట్’లో 277 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ‘వన్డే క్రికెట్’ (50 ఓవర్ ఫార్మాట్)లో భారీ వ్యక్తిగత ఇన్నింగ్స్ ఆడిన ప్రపంచ రికార్డు మన భారత క్రికెటర్‌ పేరుపైనే ఉంది. అది ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ పేరు మీద కాదండోయ్. మరొక భారతీయ బ్యాట్స్‌మన్ పేరు మీద ఉంది. ఆయనెవరో ఇప్పుడు తెలుసుకుందాం..

21 నవంబర్ 2022న బెంగళూరులో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మన్ నారాయణ్ జగదీసన్ 141 బంతుల్లో 277 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఏ బ్యాట్స్‌మన్ ఆడిన అతిపెద్ద ఇన్నింగ్స్‌గా నారాయణ్ జగదీసన్ ఈ ఇన్నింగ్స్ ప్రపంచ రికార్డు సృష్టించింది.

రోహిత్ 264 పరుగుల ఇన్నింగ్స్ రికార్డు బద్దలు..

ఈ మ్యాచ్‌లో నారాయణ్ జగదీసన్ 196.45 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ 25 ఫోర్లు, 15 సిక్సర్లు కొట్టాడు. నారాయణ్ జగదీసన్ ఎంత విధ్వంసం సృష్టించాడంటే అరుణాచల్ ప్రదేశ్ జట్టు బౌలర్లు అలసిపోయేలా చేశాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో అలిస్టర్ బ్రౌన్ ప్రపంచ రికార్డును నారాయణ్ జగదీసన్ బద్దలు కొట్టాడు. 2002లో ఓవల్‌లో సర్రే తరపున లిస్ట్-ఎ మ్యాచ్‌లో గ్లామోర్గాన్‌పై అలిస్టర్ బ్రౌన్ 268 పరుగులు చేశాడు. 2014లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ 264 పరుగులు చేశాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన పరంగా కూడా నారాయణ్ జగదీసన్ రోహిత్ శర్మను అధిగమించాడు.

నారాయణ్ జగదీషన్ జట్టు 506 పరుగులు..

ఈ మ్యాచ్‌లో నారాయణ్ జగదీశన్ నాయకత్వంలోని తమిళనాడు జట్టు అరుణాచల్ ప్రదేశ్‌తో మొదట బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 506 పరుగులు చేసింది. తమిళనాడు తరపున ఓపెనర్ సాయి సుదర్శన్ 102 బంతుల్లో 154 పరుగులు చేశాడు. నారాయణ్ జగదీశన్ 141 బంతుల్లో 277 పరుగులు చేశాడు. తమిళనాడు ఓపెనర్లు సాయి సుదర్శన్, నారాయణ్ జగదీశన్ కలిసి తొలి వికెట్‌కు 416 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

50 ఓవర్ల క్రికెట్ (వన్డే)లో అత్యధిక వ్యక్తిగత ఇన్నింగ్స్..

1. నారాయణ్ జగదీశన్ – అరుణాచల్ ప్రదేశ్‌పై 277 పరుగులు (బెంగళూరు 2022)

2. అలిస్టర్ బ్రౌన్ – గ్లామోర్గాన్‌పై 268 (లండన్ 2002)

3. రోహిత్ శర్మ – శ్రీలంకపై 264 పరుగులు (కోల్‌కతా 2014)

4. డార్సీ షార్ట్ – క్వీన్స్‌ల్యాండ్‌పై 257 పరుగులు (సిడ్నీ 2018)

5. శిఖర్ ధావన్ – దక్షిణాఫ్రికా-ఎపై 248 పరుగులు (ప్రిటోరియా 2013).

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..