Asia Cup 2025 : గ్రౌండ్లోనే కాదు..కామెంటరీ బాక్స్‌లోనూ భారత్-పాకిస్థాన్ వార్..ఆసియా కప్‌లో దిగ్గజాల మాటల యుద్ధం

ఈ సారి ఆసియా కప్ టోర్నమెంట్‌లో కేవలం ఆట మాత్రమే కాదు, కామెంటరీ బాక్స్‌లో కూడా భారత్, పాకిస్థాన్ మధ్య ఒక ప్రత్యేకమైన పోటీ చూడవచ్చు. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ టోర్నమెంట్ కోసం మల్టీ-లాంగ్వేజ్ కామెంటరీ ప్యానల్‌ను ప్రకటించింది. ఇందులో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లాండ్ వంటి పలు దేశాల మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.

Asia Cup 2025 :  గ్రౌండ్లోనే కాదు..కామెంటరీ బాక్స్‌లోనూ భారత్-పాకిస్థాన్ వార్..ఆసియా కప్‌లో దిగ్గజాల మాటల యుద్ధం
Asia Cup 2025

Updated on: Sep 09, 2025 | 11:23 AM

Asia Cup 2025 : ఆసియా కప్ 2025 మరికొద్ది గంటల్లో స్టార్ట్ కాబోతుంది. ఈసారి కామెంటరీ బాక్స్‌లో కూడా భారత్, పాకిస్థాన్ మధ్య వార్ చూడవచ్చు. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఈ టోర్నమెంట్ కోసం ప్రత్యేకంగా ఒక కామెంటరీ ప్యానెల్‌ను ప్రకటించింది. ఇందులో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లాండ్ వంటి అనేక దేశాల మాజీ క్రికెటర్లు భాగం కానున్నారు. ఆ ప్యానల్‌లో ఎవరున్నారో, వారు ఏం చెప్పారో తెలుసుకుందాం.

ఇంగ్లీష్ కామెంటరీ ప్యానల్

అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన పేర్లు ఈసారి ఇంగ్లీష్ ప్యానల్‌లో భాగం కానున్నాయి. భారత్ నుంచి సునీల్ గవాస్కర్, దినేష్ కార్తీక్, హర్ష భోగ్లే, రాబిన్ ఉతప్ప, రవి శాస్త్రి ఉన్నారు. వీరే కాకుండా పాకిస్థాన్ నుంచి వసీం అక్రమ్, అథర్ అలీ ఖాన్, శ్రీలంక నుంచి రస్సెల్ ఆర్నాల్డ్, ఇంగ్లాండ్ నుంచి నాసిర్ హుస్సేన్, న్యూజిలాండ్ నుంచి సైమన్ డూల్ కూడా తమ వాణిని వినిపించనున్నారు.

హిందీ కామెంటరీ ప్యానల్

భారత క్రికెట్ ప్రేమికులకు హిందీ ప్యానల్ ఎల్లప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. ఈసారి వీరేంద్ర సెహ్వాగ్, అజయ్ జడేజా, ఇర్ఫాన్ పఠాన్, వివేక్ రాజ్‌దాన్, అభిషేక్ నాయర్, సబా కరీమ్ వంటి దిగ్గజాలు మ్యాచ్‌ను వర్ణించనున్నారు. వీరితో పాటు గౌరవ్ కపూర్, సమీర్ కోచర్, ఆతిష్ థుక్రాల్ కూడా తమ ఎనర్జీతో ప్రేక్షకులను అలరించనున్నారు.

రీజనల్ ప్యానల్ – తెలుగు, తమిళం

సోనీ స్పోర్ట్స్ దక్షిణ భారత ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకుంది. తమిళం ప్యానల్‌లో భారత మాజీ కోచ్ భరత్ అరుణ్, డబ్ల్యూవి రామన్, హేమాంగ్ బదానీ, అరుణ్ వి, విద్యుత్ శివరామకృష్ణన్ ఉన్నారు. అదే సమయంలో తెలుగు ప్యానల్‌లో వెంకటపతి రాజు, రవి తేజ, రాకేష్ దేవా, సందీప్ బి వంటి పేర్లు ఉన్నాయి.

క్రీడాకారుల స్పందన

ఈ సందర్భంగా సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా ఆసియా కప్ ప్రయాణం ఆసక్తికరంగా ఉండబోతోందని అన్నారు. మరోవైపు రవి శాస్త్రి జట్టులో అనుభవం, యువ ఆటగాళ్ల కలయిక అద్భుతంగా ఉందని, ఈ కలయిక రాబోయే టీ20 ప్రపంచ కప్ ముందు భారత్‌కు మంచి సంకేతం అని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఎక్కడ, ఎప్పుడు ప్రారంభం?

ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి యూఏఈలో ప్రారంభం అవుతుంది. ఈసారి 8 జట్లు పాల్గొంటున్నాయి – భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ, ఒమన్, హాంకాంగ్. భారత్ తన మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..