WTC Final 2021: క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ మరికొద్ది గంటల్లో ప్రారంభంకానుంది. ఈమేరకు ఇరుజట్లు సిద్ధమయ్యాయి. భారత్, న్యూజిలాండ్ ల మధ్య సౌథాంప్టన్‌లో జరగనున్న ఈ మ్యాచ్ మధ్యాహ్నం గం. 3.30 నిమిషాలకు ప్రారంభంకానుంది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, కివీస్ సారథి కేన్ విలియమ్సన్ లు ఈ ట్రోఫీని కైవసం చేసుకునేందుకు ఎంతో ఆరాపడుతున్నారు. కారణం.. ఇప్పటివరకు వీరిద్దరి కెప్టెన్సీలో ఒక్క ఐసీసీ ట్రోపీ కూడా గెలవలేదు. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఎలాగైన విజయం సాధించేందుకు ఇరు జట్ల సారథులు భావిస్తున్నారు. కాగా, ఇప్పటి వరకు టీం ఇండియా అన్ని ఐసీసీ ట్రోఫీలను గెలుచుకుని తన సత్తా చాటింది. ఈ అరంగేట్ర డబ్ల్యూటీసీ ట్రోఫీ కోసం వేట కొనసాగిస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ మాత్రం ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా గెలవలేదు. దీంతో మంచి ఫామ్‌లో ఉన్న కివీస్ టీం ఈ ట్రోఫీపై కన్నేసింది.
అయితే, మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్లు చాలా సరదాగా కనిపించాయి. ఫొటోషూట్ సందర్భంగా ఓ వీడియోను ఐసీసీ ట్వీట్ చేసింది. దీంట్లో ఆటగాళ్లంతా సందడిగా కనిపించారు. మ్యాచ్ ఆరంభానికి ముందు భారత్, కివీస్ ఆటగాళ్లను ఫొటో షూట్ తీశారు. దీంట్లో ఇషాంత్ శర్మ ఫొటో దిగుతున్నప్పుడు.. మయాంక్ అగర్వాల్ నవ్వాడు. ఇషాంత్ ఫొటో స్టైల్స్ చూసి గట్టిగా నవ్వుతూ కనిపించాడు. దీంతో మయాంక్ అగర్వాల్ ఫొటోదిగుతున్నప్పుడు.. లంబూ(ఇషాంత్ శర్మ) ప్రేమ్ లోకి ఎంటరయ్యాడు. అంతటితో ఊరుకోకుండా మయాంక్ హెయిర్‌ను దువ్వాడు. దీంతో అప్పుడు కూడా మయాంక్ బిగ్గరగా నవ్వూతూ ఫొటోలకు ఫోజులిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. అలాగే పేసర్ జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ అజింక్య రహానె, కెప్టెన్ విరాట్‌కోహ్లీ, ఓపెనర్ శుభ్‌మన్‌గిల్ కూడా పలు రకాలుగా ఫోజులిచ్చారు. న్యూజిలాండ్ ఆటగాళ్లు సైతం సరదాగా ఫొటోషూట్‌లో కనిపించారు.
మరోవైపు విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ను మరో మ్యాచ్‌గా అనుకుంటున్నామని, మేం ఈ మ్యాచ్‌లో ఓడిపోతే.. మా ప్రయాణం ఆగిపోదని అన్నాడు. మా స్టైల్‌లో మేం ఆడతాం. విజయం కోసం శాయశక్తులా ప్రయత్నిస్తాం అని వెల్లడించాడు. అంతా ఈ మ్యాచ్‌ను ఓ యుద్ధంలా భావిస్తున్నారని, ఇది మాకు కేవలం ఓ సాధారణ టెస్టు మ్యాచ్ మాత్రమే అని చెప్పుకొచ్చాడు.
ప్లేయింగ్ లెవన్:
భారత్: రోహిత్ శర్మ, శుబ్మాన్ గిల్, చేతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె, రిషబ్ పంత్ (కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, ఇశాంత్ శర్మ, మహ్మద్ షమీ.
The calm before the storm ?
Take a behind the scenes look at Photo Shoot Day for the #WTC21 Final ?#INDvNZ pic.twitter.com/7sLK1UX8FA
— ICC (@ICC) June 18, 2021
The Big Day is here! ? ?
Get behind #TeamIndia & show your support as they take on New Zealand in #WTC21 Final in a few hours from now! ? ? pic.twitter.com/8k9B74DMPg
— BCCI (@BCCI) June 18, 2021
Also Read:
WTC Final 2021 IND vs NZ: డబ్ల్యూటీసీ ఫైనల్ కు అంతా సిద్ధం..! లైవ్ అందించే ఛానల్స్ ఇవే..!