
Abhishek Sharma dropped Rinku Singh in: వెస్టిండీస్‌పై విజయం సాధించి టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్‌కు అర్హత సాధించిన భారత జట్టు ఇప్పుడు ఇంగ్లాండ్‌తో కీలక పోరుకు సిద్ధమవుతోంది. ముంబై వాంఖడే స్టేడియంలో మార్చి 5న జరిగే ఈ మ్యాచ్ భారత్‌కు అసలు పరీక్షగా మారనుంది.
వెస్టిండీస్‌పై తప్పనిసరి గెలవాల్సిన మ్యాచ్‌లో సంజూ శాంసన్ అద్భుతమైన 97 పరుగులతో భారత్‌ను 196 పరుగుల రికార్డ్ టార్గెట్ ను చేధించేలా చేశాడు. అయితే సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. సూపర్-8 దశలో ఇంగ్లాండ్ మూడు మ్యాచ్‌లు గెలిచి అద్భుత ఫామ్‌లో ఉంది.
విజయం సాధించినప్పటికీ, భారత జట్టు టాప్ ఆర్డర్ బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శనపై ఆందోళనలో ఉంది. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఫామ్ లోపించడం జట్టు మేనేజ్‌మెంట్‌ను ఆలోచనలో పడేసింది.
ఇషాన్ కిషన్ ఇప్పటికే జట్టులో ఉన్న నేపథ్యంలో, అభిషేక్ శర్మను తప్పించి రింకూ సింగ్‌కు అవకాశం ఇవ్వవచ్చని అంచనా. రింకూ సింగ్ ఫినిషర్ పాత్రలో మెరుగైన ఎంపికగా నిలుస్తున్నాడు.
అభిషేక్ గతంలో జట్టుకు మంచి సేవలందించినప్పటికీ, ఈ కీలక మ్యాచ్ దృష్ట్యా అతనికి చిన్న విరామం ఇవ్వడం మంచిదని భావించవచ్చు. ఈ మార్పుతో తిలక్ వర్మను నంబర్-3 స్థానంలో ఆడించే అవకాశం కూడా ఉంటుంది.
బౌలింగ్ యూనిట్‌లో జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణిస్తున్నాడు. కానీ, కొత్త బంతితో అర్ష్‌దీప్ సింగ్ ఎక్కువ వికెట్లు సాధించలేకపోయాడు. మహమ్మద్ సిరాజ్ ఎంపికలోకి రావొచ్చు అనే చర్చ ఉన్నప్పటికీ, సెమీఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో అదే బౌలింగ్ కాంబినేషన్‌ను కొనసాగించే అవకాశమే ఎక్కువగా ఉంది.
సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లాండ్‌పై సెమీఫైనల్ పోరు హై వోల్టేజ్ మ్యాచ్‌గా మారనుంది. జట్టు ఎంపిక, వ్యూహాలు, ఆటగాళ్ల ఫామ్ మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించనున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..