Virat Kohli: మాంచెస్టర్ టెస్ట్ రద్దుకు కారణం అదే.. ఎట్టకేలకు మౌనం వీడిన టీమిండియా కెప్టెన్..!

Royal Challengers Bangalore: టీమిండియా సహోద్యోగి ఫిజియో యోగేష్ పర్మార్ కోవిడ్ -19 బారిన పడిన తర్వాత ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరగాల్సిన ఐదవ టెస్ట్ ఆడటానికి భారత ఆటగాళ్లు నిరాకరించారు.

Virat Kohli: మాంచెస్టర్ టెస్ట్ రద్దుకు కారణం అదే.. ఎట్టకేలకు మౌనం వీడిన టీమిండియా కెప్టెన్..!
Rcb Players

Virat Kohli: కోవిడ్ -19 కారణంగా ఇంగ్లండ్‌తో ఐదవ టెస్టు వాయిదా వేయడం దురదృష్టకరమని పేర్కొన్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఈ అనిశ్చిత సమయాన్ని ఎదుర్కోవడానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) బయో బబుల్ బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టోర్నమెంట్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. జాతీయ జట్టు సహోద్యోగి ఫిజియో యోగేశ్ పర్మార్ కోవిడ్ బారిన పడిన తర్వాత ఇంగ్లండ్‌తో ఐదవ టెస్టును ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో వాయిదా వేశారు.

కోహ్లీ డిజిటల్ మీడియాతో మాట్లాడుతూ, ‘మేము ముందుగా ఇక్కడకు చేరుకోవడం దురదృష్టకరం. (టెస్ట్ రద్దు కారణంగా దుబాయ్ వస్తున్న సందర్భంలో), కానీ కరోనా వైరస్ కారణంగా ఇలా జరగడం బాధగా అనిపించింది. ఇలాంటి అనేక పరిస్థితుల మధ్య ఐపీఎల్ ఆడేందుకు దుబాయ్ వచ్చాం. వాటిని అన్నింటిని మర్చిపోయి ఐపీఎల్‌లో జట్టుకు మంచి ఇన్నింగ్స్‌ ఆడడంపై ఫోకస్ చేస్తాం. ఇది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు, టీ 20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు చాలా ముఖ్యమని’ పేర్కొన్నాడు.

సెప్టెంబర్ 20న బరిలోకి ఆర్‌సీబీ
కోవిడ్ -19 కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ రెండో దశ ఆదివారం (సెప్టెంబర్ 19) నుంచి ప్రారంభం కానుండగా, కోహ్లీ జట్టు సోమవారం ఈ దశలో తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ జట్టులో శ్రీలంక లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగ, సింగపూర్ బ్యాట్స్‌మెన్ టిమ్ డేవిడ్ వంటి ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారు. ఈ ఆటగాళ్ల రాకతో కెప్టెన్ సంతోషంగా ఉన్నాడు.

కోహ్లీ మాట్లాడుతూ, ‘నేను అందరితో టచ్‌లో ఉన్నాను. మేము గత ఒక నెలలో చాలా మాట్లాడుతకున్నాం. జట్టులో ఇతరుల స్థానాన్ని ఆక్రమించే ఆటగాళ్ల గురించి కూడా చర్చలు జరిగాయి. మా కీలక ఆటగాళ్లకు బదులుగా ప్రతిభావంతులైన క్రికెటర్లను జట్టులో చేర్చుకోగలిగాము. మేము కీలక ఆటగాళ్లను కోల్పోయాం. కానీ, వారి స్థానంలో వస్తున్న ఆటగాళ్లు ఈ పరిస్థితులకు (దుబాయ్) గొప్ప నైపుణ్యాలు కలిగి ఉన్నారు. నేను వారిని కలవడానికి ఎదురుచూస్తున్నాను. అందరితో ప్రాక్టీస్ చేయడానికి ఎదురు చూస్తున్నాను. మేము ఈ సీజన్‌లో మంచి ప్రారంభాన్ని కొనసాగించాలనుకుంటున్నాము.

ఈ సీజన్‌లో అద్భుతంగా కోహ్లీసేన..
ఐపీఎల్ ప్రథమార్ధంలో ఆర్‌సీబీ ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఏడు మ్యాచ్‌లలో ఐదు గెలిచింది. పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో నిలిచింది. అయితే ఇంతవరకు ఆర్‌సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోవడం గమనార్హం.

Also Read: ఇంగ్లాండ్‌ని ఇబ్బంది పెట్టిన ప్లేయర్ రిటైర్మెంట్ ప్రకటించాడు..! విరాట్ కోహ్లీ కంటే ముందు వరుసలో నిలిచాడు..

Shane Warne: టీమిండియ బ్యాటింగ్ ఆర్డర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన షేన్‌ వార్న్‌..

9 మంది బౌలర్ల ఊచకోత.. 17 ఏళ్ల ప్లేయర్ పెను విధ్వంసం.. సూపర్ సెంచరీతో ప్రత్యర్ధికి చుక్కలు..

Click on your DTH Provider to Add TV9 Telugu