
Asia cup 2025 India vs Pakistan Match Playing XI: ఆసియా కప్‌లో ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు సాధించిన భారత్, నేడు సూపర్ 4 రౌండ్‌లో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడుతుంది. గ్రూప్ దశలో భారత్ ఏడు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఏకపక్షంగా ఓడించిన సంగతి తెలిసిందే. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పాకిస్తాన్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ప్లేయింగ్ ఎలెవన్‌లో భారత్ రెండు మార్పులు చేసింది. జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి తిరిగి ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చారు. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడిన హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌లను జట్టులోకి తీసుకోలేదు.
లీగ్ దశలో జరిగిన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌లో కరచాలనం వివాదం చోటు చేసుకుంది. పహల్గామ్ దాడికి నిరసనగా భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి నిరాకరించారు. ఆ తర్వాత, పాకిస్తాన్ టీం మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌పై ఫిర్యాదు చేసింది. మ్యాచ్ రిఫరీ ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఫిర్యాదుతో ఐసీసీని సంప్రదించింది.
పైక్రాఫ్ట్‌ను టోర్నమెంట్ నుంచి తొలగించాలని పీసీబీ డిమాండ్ చేసింది. అలా జరగకపోతే, కనీసం అతడిని పాకిస్తాన్ మ్యాచ్‌ల నుంచి అయినా మినహాయించాలి. పీసీబీ డిమాండ్లలో దేనినీ ఐసీసీ అంగీకరించలేదు. నేటి మ్యాచ్‌కు ఆండీ పైక్రాఫ్ట్ ఇప్పటికీ రిఫరీగా ఉండనున్నారు. నిరసనగా పాకిస్తాన్ నిన్న తన ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను కూడా రద్దు చేసుకుంది.
భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సంజు శాంసన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్(కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..