U19 World Cup 2022: దూసుకెళ్తోన్న యంగ్ ఇండియా.. ఐర్లాండ్ పై ఘన విజయం..

|

Jan 23, 2022 | 4:30 AM

ట్రినిడాడ్ వేదికగా జరగుతున్న అండర్ 19 వరల్డ్ కప్ టోర్నమెంట్లో టీమిండియా దూసుకెళుతోంది.  మొదటి మ్యాచ్ లో బలమైన సఫారీలను మట్టికరిపించిన భారత యువ ఆటగాళ్లు రెండో మ్యాచ్ లోనూ అదే జోరు

U19 World Cup 2022: దూసుకెళ్తోన్న యంగ్ ఇండియా.. ఐర్లాండ్ పై ఘన విజయం..
Follow us on

ట్రినిడాడ్ వేదికగా జరగుతున్న అండర్ 19 వరల్డ్ కప్ టోర్నమెంట్లో టీమిండియా దూసుకెళుతోంది.  మొదటి మ్యాచ్ లో బలమైన సఫారీలను మట్టికరిపించిన భారత యువ ఆటగాళ్లు రెండో మ్యాచ్ లోనూ అదే జోరు చూపించారు.  పసి కూన ఐర్లాండ్ పై ఏకంగా 174 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు.  మొదట బ్యాటింగ్ కు దిగిన యంగ్ టీమిండియా  నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 307 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు హర్నూర్ సింగ్ 88, రఘు వంశీ 79 పరుగులతో మొదటి వికెట్ కు ఏకంగా 164 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు. ఆతర్వాత వచ్చిన   రాజ్ బవ(42), నిశాంత్ సింధు(36), రాజ్ వర్ధన్ (39)  కూడా సత్తాచాటడంతో ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కాగా 308 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఐర్లాండ్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు.

మ్యాచ్ కు ముందే కరోనా కలకలం..

భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో 39 ఓవర్లలో 133 పరుగులకే ఐర్లాండ్ జట్టు చాపచుట్టేసింది. దీంతో టీమిండియా 174 పరుగుల భారీ విజయం అందుకుంది.  సంగ్వార్ , అనీశ్వర్, కౌషల్ తంబే తలా రెండు వికెట్లతో ఐర్లాండ్ పతనాన్ని శాసించారు. ఐర్లాండ్ జట్టులో స్కాట్ మెక్ బెత్ (మాత్రమే) 32 పరుగులతో కొద్ది సేపు భారత బౌలర్లను అడ్డుకున్నాడు.   88 పరుగులతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన హర్నూర్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్  గా ఎంపికయ్యాడు. కాగా ఈ మ్యాచ్ కు ముందే టీమిండియాకు గట్టి ఎదురు  దెబ్బ తగిలింది. కెప్టెన్ యశ్ ధుల్, వైస్ కెప్టెన్ ఎస్ కే రషీద్ తో సహా మొత్తం 6 ఆరుగురు ఆటగాళ్లు కొవిడ్ బారిన పడ్డారు. దీంతో జట్టకు నిశాంత్ సింధు సారథ్యం వహించాడు. ఇక ఆటగాళ్లందరూ ఐసోలేషన్ లోకి వెళ్లిపోవడంత మైదానంలోని ఆటగాళ్ల కోసం కోచ్ డ్రింక్స్ తీసుకురావడం గమనార్హం . కాగా వరుసగా రెండో మ్యాచ్ లోనూ విజయం సాధించడంలో టీమిండియా సూపర్ లీగ్ క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధించింది.