Sanju Samson: ఖాళీ సమయంలో నేను, నా భార్య అతని రీల్స్ చూస్తుంటాం.. టీమిండియా క్రికెటర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్

|

Aug 17, 2022 | 2:54 PM

India vs Zimbabwe: టీమిండియాలో సుస్థిర స్థానం కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు టీమిండియా యంగ్‌ వికెట్‌ కీపర్‌ అండ్‌ బ్యాటర్‌ సంజూ శామ్సన్‌ (Sanju Samson). అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు.

Sanju Samson: ఖాళీ సమయంలో నేను, నా భార్య అతని రీల్స్ చూస్తుంటాం.. టీమిండియా క్రికెటర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్
Sanju Samson
Follow us on

India vs Zimbabwe: టీమిండియాలో సుస్థిర స్థానం కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు టీమిండియా యంగ్‌ వికెట్‌ కీపర్‌ అండ్‌ బ్యాటర్‌ సంజూ శామ్సన్‌ (Sanju Samson). అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉన్న అతను ఈ సిరీస్‌లో రాణించి టీ20 ప్రపంచకప్‌ అవకాశాలను మెరుగుపర్చుకోవాలని ఆశిస్తున్నాడు. కాగా సిరీస్‌ ప్రారంభానికి ఇంకాస్త సమయముండడంతో సరదాగా నెటిజన్లతో ముచ్చటించాడీ యంగ్‌ ప్లేయర్‌. ర్యాపిడ్‌ ఫైర్‌ సెషన్‌లో భాగంగా ఫ్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చాడు. అదేవిధంగా తన ఇష్టాయిష్టాలు, అభిరుచుల గురించి పంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్‌ చేసుకోగా అది కాస్తా వైరలవుతోంది.

శామ్సన్ దంపతుల ఫొటోలు..

ఇవి కూడా చదవండి

క్వొశ్చన్‌ అండ్‌ ఆన్సర్‌ ప్రక్రియలో భాగంగా తన ముద్దుపేరు బప్పు అని శామ్సన్‌ చెప్పుకొచ్చాడు. తనకు చాక్‌లెట్లంటే అంటే చాలా ఇష్టమని, అయితే క్రికెట్‌ కోసం పరిమితంగా తింటున్నానన్నాడు. అమ్మ చేతివంటకే ఎక్కువ ప్రాధాన్యమిస్తానని, అయితే క్రికెట్‌ షెడ్యూల్స్‌తో ఆ అదృష్టం దొరకడం లేదన్నాడు. ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిష్టియన్‌ రొనాల్డో, ఎంఎస్‌ ధోని తన ఫేవరెట్‌ ఆటగాళ్లని తెలిపాడు. ఇక ఖాళీ సమయాల్లో తన సతీమణితో కలిసి శిఖర్‌ ధావన్‌ ఇన్‌స్టా రీల్స్‌ చూస్తారని చెప్పుకొచ్చాడీ స్టార్‌ ప్లేయర్‌. దేవుడు సూపర్‌ పవర్స్‌ ఇస్తే తనకు ఇష్టమైన ప్రదేశాలన్నింటిని క్షణకాలంలో చుట్టేసి వస్తానన్నాడు. ఇష్టమైన ప్రదేశాల గురించి అడగ్గా.. తన స్వస్థలం కేరళలో నదీజలాలు ఎక్కువని, అక్కడి బీచ్‌లలో గడిపేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తానన్నాడు. కాగా జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ రేపటి (ఆగస్టు 18) నుంచి ప్రారంభం కానుంది. కేఎల్‌ రాహుల్‌ టీమిండియాకు సారథ్యం వహిస్తున్నాడు.

ఇది కూడా చదవండి:  టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..