INDW vs WIW: స్మృతి మంధాన వెరీ వెరీ స్పెషల్ ఇన్నింగ్స్.. సెంచరీతో సత్తా చాటిన బ్యూటీఫుల్ ప్లేయర్

|

Mar 12, 2022 | 9:41 AM

భారత మహిళల జట్టు ఓపెనర్ స్మృతి మంధానకు వెస్టిండీస్ బ్యాటింగ్ చేయడం అంటే ఎంతో ఇష్టం. పరిస్థితులు ఎలా ఉన్నా, స్మృతి కరీబియన్ జట్టుపై ధాటిగా ఆడడం అలవాటు చేసుకుంది.

INDW vs WIW: స్మృతి మంధాన వెరీ వెరీ స్పెషల్ ఇన్నింగ్స్.. సెంచరీతో సత్తా చాటిన బ్యూటీఫుల్ ప్లేయర్
Indw Vs Wiw Smriti Mandhana
Follow us on

మహిళల ప్రపంచ కప్‌లో టీమిండియా (Team India) నేడు వెస్టిండీస్‌తో తలపడుతోంది. తొలి మ్యాచులో విజయం, రెండో మ్యాచులో పరాజయం తరువాత, ఘనంగా పునరాగమనం చేసింది. వెస్టిండీస్‌తో జరిగే ఈ మ్యాచులో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేస్తుంది. ఈ క్రమంలో భారత మహిళల జట్టు ఓపెనర్ స్మృతి మంధాన(Smriti Mandhana) తన అధ్బుత ఆటతీరుతో ఆకట్టుకుంది. వెస్టిండీస్ జట్టుపై భారీ స్కోరు చేసేందుకు సిద్ధమైంది. కరేబియన్ బౌలర్ల థ్రెడ్‌ను విజయవంతంగా ఎదుక్కొంటూ ముందుకుసాగింది. పరిస్థితులు ఎలా ఉన్నా, స్మృతి కరీబియన్ జట్టుపై ధాటిగా ఆడుతుంది. ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. ప్రపంచకప్ వేదికపై అద్భుత సెంచరీతో ఆకట్టుకుంది. వెస్టిండీస్‌ (West Indies Women)పై స్మృతి భారత్‌కు కవచంలా నిలిచి అద్భుతమైన సెంచరీకి స్క్రిప్ట్ రాసింది.

వెస్టిండీస్‌పై స్మృతి మంధాన 108 బంతుల్లో సెంచరీ పూర్తి చేసింది. తన సెంచరీలో 9 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. వన్డే క్రికెట్‌లో వెస్టిండీస్‌పై తనకి ఇది రెండో సెంచరీ. ఈ రెండు సెంచరీల స్క్రిప్ట్‌ను కరీబియన్‌ జట్టుపై ఆడిన గత మూడు ఇన్నింగ్స్‌ల్లోనే మంధాన పూర్తి చేయడం విశేషం. అంతకుముందు వెస్టిండీస్‌పై అజేయంగా 106 పరుగులు చేసింది.

సెంచరీ తరువాత జోరు పెంచిన మంధాన..

సెంచరీ పూర్తి చేసిన వెంటనే వెస్టిండీస్ బౌలర్లపై విరుచకపడింది. ఓ ఓవర్లో ఏకంగా వరుసగా మూడు బౌండరీలు సాధించి, దూకుడుగా మారింది. అయితే 150 దిశగా సాగుతోన్న మంధానను..షమీలియా తన బౌలింగ్‌తో బోల్తా కొట్టించింది. దీంతో 123 పరుగుల(119 బంతులు, 13 ఫోర్లు, 2 సిక్సులు) వద్ద మంధాన పెవిలియన్ చేరింది.హర్మన్ ప్రీత్ కౌర్‌తో కటిసి 184 పరుగుల కీలక భాగస్వామ్యం అందించింది.

5వ వన్డే సెంచరీ..

వెస్టిండీస్‌పై రెండో సెంచరీ చేసిన స్మృతి మంధాన వన్డే కెరీర్‌లో ఐదో సెంచరీ సాధించింది. ఆమె స్వదేశం వెలుపల విదేశీ మైదానాల్లో ఈ ఐదు సెంచరీలు సాధించడం విశేషం. అలా చేసిన మొదటి భారత మహిళా క్రీడాకారిణిగా నిలిచింది. ఈ క్రమంలో మిథాలీ రాజ్ విదేశాల్లో అత్యధికంగా 4 సెంచరీలు చేసిన భారత రికార్డును బద్దలు కొట్టింది.

రూటు మార్చిన టీమిండియా..

రెండో మ్యాచులో ఓటమితో టీమిండియా రూటు మార్చింది. వెస్టిండీస్‌తో మ్యాచులో ధాటిగా బ్యాటింగ్ చేస్తూ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. కడపటి వార్తలు అందేసరికి టీమిండియా 44 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 268 పరుగులు చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ 83 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది.

Also Read: IND vs SL: కెప్టెన్‌గా 2వ మ్యాచులో రోహిత్ స్పెషల్ రికార్డ్.. వన్డే-టీ20ల్లో లంకపైనే బాదేశాడు.. ఇప్పుడు టెస్టుల వంతు?

IND vs SL Pink Ball Test: డే అండ్ నైట్ టెస్టుకు అంతా సిద్ధం.. పింక్ బాల్‌తో టీమిండియా ప్రదర్శన ఎలా ఉందంటే?