IND Vs WI: ఆ నలుగురుంటే టీమిండియా కొంప మునిగినట్టే.. వన్డే ప్రపంచకప్ ఫసకే.!

|

Jun 24, 2023 | 7:00 PM

జూలై-ఆగష్టు మధ్య భారత్, వెస్టిండీస్ మూడు ఫార్మాట్లలో సిరీస్‌లు ఆడనున్నాయి. మొదటిగా రెండు టెస్టులతో స్టార్ట్ అయ్యే ఈ సిరీస్‌లో..

IND Vs WI: ఆ నలుగురుంటే టీమిండియా కొంప మునిగినట్టే.. వన్డే ప్రపంచకప్ ఫసకే.!
Team India
Follow us on

జూలై-ఆగష్టు మధ్య భారత్, వెస్టిండీస్ మూడు ఫార్మాట్లలో సిరీస్‌లు ఆడనున్నాయి. మొదటిగా రెండు టెస్టులతో స్టార్ట్ అయ్యే ఈ సిరీస్‌లో.. ఆ తర్వాత రెండు జట్లు మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడతాయి. ఈ నేపధ్యంలో టెస్టులు, వన్డేలకు సంబంధించిన టీమిండియా తుది జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అనూహ్యంగా టెస్ట్ స్పెషలిస్ట్ ఛటేశ్వర పుజారా, ఉమేష్ యాదవ్‌లపై వేటు వేసి.. ఐపీఎల్ హీరోస్ యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ముకేష్ కుమార్‌లకు చోటు కల్పించింది బీసీసీఐ. ఈ రెండు ఫార్మాట్లలోనూ రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా అజింక్య రహనే, వన్డేల్లో వైస్ కెప్టెన్సీ బాధ్యతలు హార్దిక్ పాండ్యా చేపట్టనున్నారు.

ఇదిలా ఉంటే.. బౌలింగ్ విభాగంలో టీమిండియా సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయం.. అటు మాజీ క్రికెటర్లను, ఇటు ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచేలా చేసింది. వన్డే ప్రపంచకప్‌ను ముందు పెట్టుకుని.. జట్టులో కీ-బౌలర్‌ను ఎందుకని పక్కన పెట్టారు. అలాగే యువ పేస్ బౌలర్లకు కూడా ఛాన్స్ ఎందుకివ్వలేదని ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు.

అసలు షమీకి విశ్రాంతి ఇచ్చారా.? లేక ఉద్వాసన పలికారా.? దీనిపై క్లారిటీ లేదు. బుమ్రా రాక, సిరాజ్, షమీలు పేస్ ఎటాక్ సారధ్య బాధ్యతలు తీసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ అంతకముందే బీసీసీఐ సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకోవడం విస్మయానికి గురి చేసింది. వన్డే ప్రపంచకప్‌ ముందుగా టీమిండియా 12 మ్యాచ్‌లు మాత్రమే ఆడుతుంది. ఇప్పటికే డబ్ల్యూతీసీ ఫైనల్ అనంతరం టీమిండియా ప్లేయర్లకు కావల్సినంత విశ్రాంతి దొరికింది. ఈ సమయంలో షమీని పక్కనపెట్టి.. బీసీసీఐ ఏం చేయాలనుకుంటోందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

మరో మూడు నెలల్లో వన్డే ప్రపంచకప్‌కు మొదలు కానుంది. ఈ తరుణంలో బీసీసీఐ ప్లేయర్ల ఎంపిక విషయంలో తనకు ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. కాగా, అనుభవం లేని ప్లేయర్లు, ఫామ్‌లో లేని ఆటగాళ్లను బీసీసీఐ సెలెక్టర్లు ఈ సిరీస్‌కు ఎంపిక చేసి.. ప్రస్తుతం వన్డేలు, టెస్టులు ఆడుతూ మంచి ఫామ్‌లో ఉన్న ప్లేయర్స్‌కు విశ్రాంతినివ్వడం కరెక్ట్ ఆప్షన్ కాదని సెలెక్టర్లపై మండిపడుతున్నారు. టీమిండియాకు ఈ నలుగురు సెలెక్టర్లు శనిలా దాపురించారని.. వారు ఉన్నంత వరకు టీమిండియా ఫేట్ ఇంతేనని కామెంట్స్ చేస్తున్నారు. ఇదే జరిగితే ప్రపంచకప్ ఫసక్ అవుతుందని తమ అభిప్రాయాలను ఫ్యాన్స్ పంచుకుంటున్నారు.