IND vs WI, ODI Series: భారత్ వేదికగా జరిగే 2023 ప్రపంచకప్ టోర్నీ కోసం అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్ వన్డే జట్టు ఇప్పుడు టీమిండియాతో తలపడేందుకు సిద్ధంగా ఉంది. గురువారం నుంచి ప్రారంభమయ్యే 3 మ్కాచ్‌ల వన్డే సిరీస్ కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ మంగళవారం ప్రకటించింది. వెస్టిండీస్ ప్రకటించిన వన్డే క్రికెట్ జట్టును షై హోప్ నడిపిస్తుండగా.. రోవ్‌మన్ పావెల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే ఈ జట్టులో విండీస్ స్టార్స్ జేసన్ హోల్డర్, నికోలస్ పూరన్‌కి అవకాశం దక్కలేదు. హోల్డర్ సోమవారం ముగిసిన టెస్ట్ సిరీస్‌లో విండీస్ తరఫున ఆడినప్పటికీ వన్డే జట్టులో అతన్ని ఎంపిక చేయలేదు. అలాగే ఓషన్ థామస్, షిమ్రాన్ హెట్మెయర్‌కి విండీస్ బోర్డ్ జట్టులోకి పిలుపునిచ్చింది.
షిమ్రాన్ హెట్మెయర్ దాదాపు 2 ఏళ్ల తర్వాత జట్టులోకి తిరిగి రావడం విశేషం. ఇటీవల జరిగిన వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌కి కూడా ఎంపిక కాని హెట్మెయర్‌కి భారత్‌పై మంచి రికార్డ్ ఉంది. భారత్‌తో 12 వన్డేలు ఆడిన అతను 2 సెంచరీలు, ఒక సెంచరీతో మొత్తం 500 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతని స్ట్రైక్ రేట్ 121.35 కాగా, బ్యాటింగ్ యావరేజ్ 45.45. ఇంకా యువ పేసర్ జాడాన్ సీల్స్, లెగ్ స్పిన్నర్ యాన్నిక్ కరియా గాయాల నుంచి కోలుకుని మళ్లీ వన్డే జట్టులోకి వచ్చారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గుడాకేష్ మోతీ కూడా రిహాబిటేషన్ తర్వాత ఫిట్‌గా టీమ్‌లోకి తిరిగి వచ్చాడు. మరోవైపు వన్డే సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ఎప్పుడో ప్రకటించింది. ఇక ఈ వన్డే సిరీస్ భారత్‌కు త్వరలో జరిగే మెగా టోర్నీకి సన్నాహం వంటిది. ఇంకా జట్టులోని యువ ఆటగాళ్ల ఆటతీరును చూసేందుకు మంచి అవకాశం.
West Indies name squad for CG United ODI Series powered by YES BANK
Full details here⬇️https://t.co/dlls8r9uZl pic.twitter.com/zGoHmgKACy
— Windies Cricket (@windiescricket) July 24, 2023
కాగా, సోమవారం ముగిసిన టెస్ట్ సిరీస్‌ను భారత్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి టెస్టులో భారత్ ఒక ఇన్నింగ్స్, 141 పరుగుల తేడాతో విజయం సాధించగా.. రెండు టెస్ట్ వరుణుడి కారణంగా డ్రాగా ముగిసింది. ఐదో రోజు ఆట ప్రారంభం నుంచే వర్షం పడి గ్రౌండ్ తడిచిపోయింది. ఐదో రోజు ఆట సమయం ముగిసేసరికి మ్యాచ్ ఆడడానికి వీలుగా లేకపోవడం, టెస్ట్‌కి రిజర్వ్ డే లేకపోవడం వల్ల డ్రాగా ముగిసింది. ఇక ఈ సిరీస్‌లో యశస్వీ జైస్వాల్ రూపంలో మంచి టెస్ట్ ప్లేయర్ లభించాడు. ఇంకా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా సెంచరీలతోొ మెరిసారు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్.
వెస్టిండీస్ టీమ్: షై హోప్(కెప్టెన్), రోవ్‌మన్ పావెల్(వైస్ కెప్టెన్), అలిక్ అథనాజే, యానిక్ కరియా, కీసీ కార్టీ, డొమినిక్ డ్రేక్స్, షిమ్రాన్ హెట్మెయర్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోషన్, జేడెన్ సీల్స్, రొమారియో షెపర్డ్, కెవిన్ సింక్లైర్, ఒషానే థామస్,
ప్రిపరేషన్ క్యాంపులో అదనపు ఆటగాళ్ళు: డెన్నిస్ బుల్లి, రోస్టన్ చేజ్, మెక్‌కెన్నీ క్లార్క్, కావెం హాడ్జ్, జైర్ మెక్‌కాలిస్టర్, ఒబెడ్ మెక్కాయ్, కెవిన్ విక్హామ్
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..