India VS West Indies 1st ODI: భారత జట్టు కరేబియన్ పర్యటన నేటి (జులై 22)తో ప్రారంభంకానుంది. ట్రినిడాడ్ వేదికగా జరిగే మొదటి వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుతో తలపడనుంది టీమిండియా. కాగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, బుమ్రా లాంటి స్టార్ ఆటగాళ్లు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్నారు. దీంతో వన్డే సిరీస్‌లో టీమిండియాకు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) సారథ్యం వహించనున్నాడు. ఇదిలా ఉంటే వన్డే సిరీస్‌కు ముందు భారత జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ సిరీస్‌కు స్టాండింగ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న రవీంద్ర జడేజా (Ravindra Jadeja) మోకాలి గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో నేటి మ్యాచ్‌కు ఈ ఆల్‌రౌండర్ దూరం కానున్నట్లు సమాచారం
కాగా ఇంగ్లండ్‌తో ఆఖరి వన్డేలోనే మోకాలి గాయంతో ఇబ్బంది పడ్డాడు జడేజా. ఇక విండీస్‌తో సిరీస్‌కు ముందు ఈ గాయం మరింత తీవ్రమైందని తెలుస్తోంది. దీంతో జడ్డూ మొదటి మ్యాచ్‌కు దూరం కానున్నాడని సమాచారం. అయితే ఈ మేటి ఆల్‌రౌండర్‌ను ఒక మ్యాచ్‌కే దూరం పెట్టాలా లేక మొత్తం వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించాలా అన్నది బీసీసీఐ యోచిస్తుంది. కాగా విండీస్‌తో టీ20 సిరీస్‌కు జడేజా అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ చెబుతోంది. వచ్చేవారం నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా టాపార్డర్ ఆటగాడు కేఎల్ రాహుల్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో అతను విండీస్‌తో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు.
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..