KL Rahul: భారత జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul)కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో కోలుకుని విండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన అతను కరోనా (Corona) బారిన పడ్డాడు. ఐపీఎల్ తర్వాత గాయపడిన రాహుల్ జర్మనీకి వెళ్లి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆతర్వాత విశ్రాంతికే పరిమితం కావడంతో మొదట దక్షిణాఫ్రికాతో టీ 20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఆతర్వాత కీలకమైన ఇంగ్లండ్ పర్యటనకు కూడా అందుబాటులో లేకపోయాడు. గాయం మానడంతో కొద్దిరోజుల క్రితం జర్మనీ నుంచి భారత్‌కు చేరుకుని బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో మళ్లీ ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఈక్రమంలోనే విండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. త్వరలో ఫిట్‌నెస్ నిరూపించుకుని కరేబియన్ గడ్డపై అడుగుపెడతాడనుకున్న పరిస్థితుల్లో కొవిడ్‌కు చిక్కాడు. దీంతో విండీస్ పర్యటనకు ఈ టాపార్డర్ బ్యాటర్ దూరమయ్యే అవకాశాలున్నాయి.
కాగా వచ్చేవారమే విండీస్‌తో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈలోపు అతను పూర్తిగా కోలుకోవడం కష్టమే. కాగా విండీస్ పర్యటన తర్వాత టీమిండియా జింబాబ్వేలో అడుగుపెట్టనుంది. ఆసియా కప్ నేపథ్యంలో అగ్రశ్రేణి ఆటగాళ్లకు ఈ టూర్ నుంచి విశ్రాంతి లభించనుంది. ఈక్రమంలోనే ద్వితీయ శ్రేణి జట్టుతోనే అక్కడకు వెళ్లనుంది భారత జట్టు. కేఎల్ రాహుల్ టీమిండియా సారథ్య బాధ్యతలు తీసుకుంటాడని తెలుస్తోంది. ఇక విండీస్, భారత్‌ల మధ్య ట్రినిడాడ్ వేదికగా ఈరోజు మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్‌లో శిఖర్ ధావన్ జట్టును ముందుండి నడిపించనున్నాడు.
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..