
India vs West Indies 5th T20I Playing XI: భారత్-వెస్టిండీస్ టీ20 సిరీస్‌లో 5వ, చివరి మ్యాచ్ ఈరోజు అమెరికాలోని ఫ్లోరిడాలో మొదలైంది. లాడర్‌హిల్‌లోని క్రికెట్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన టీమిండియా సారథి తొలుత బ్యాటింగ్ ఎంకున్నాడు. దీంతో విండీస్ మొదట బౌలింగ్ చేయనుంది. కాగా, టీమిండియా ప్లేయింగ్ 11లో ఎలాంటి మార్పులేదు. అయితే, వెస్టిండీస్ టీంలో ఒక మార్పు చోటు చేసుకుంది.
ప్రస్తుతం 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇరుజట్లు 2-2తో సమంగా నిలిచాయి. ఈ మ్యాచ్‌లో వర్షం కురిసే అవకాశం ఉంది. కాగా, చివరి మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది.
A look at #TeamIndia‘s Playing XI for the decider 👌
Follow the match – https://t.co/YzoQnY7mft#WIvIND pic.twitter.com/2VeXuzEowS
— BCCI (@BCCI) August 13, 2023
ఫ్లోరిడాలో శుక్ర, శనివారాల్లో అడపాదడపా వర్షం కురిసినా, మ్యాచ్‌కు ముందే నిలిచిపోయింది. ఆదివారం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, వర్షం కారణంగా మ్యాచ్ ఆడలేకపోతే సిరీస్ 2-2తో డ్రాగా ముగుస్తుంది.
🚨 Toss Update 🚨#TeamIndia win the toss and elect to bat first in the 5th & final T20I 👌
Follow the match – https://t.co/YzoQnY7mft#WIvIND pic.twitter.com/GAKj29K2jM
— BCCI (@BCCI) August 13, 2023
ఈ మ్యాచ్ ఓడితే వెస్టిండీస్‌తో 2 కంటే ఎక్కువ మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ తొలిసారి కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా వరుసగా రెండోసారి వెస్టిండీస్‌ను ఓడించనుంది.
Welcome to the live coverage of the 5TH T20I between India and West Indies. https://t.co/YzoQnY7mft #WIvIND
— BCCI (@BCCI) August 13, 2023
టీమిండియా ప్లేయింగ్ 11: యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సంజు శాంసన్(కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్.
వెస్టిండీస్ ప్లేయింగ్ 11: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, షాయ్ హోప్, నికోలస్ పూరన్(కీపర్), రోవ్‌మన్ పావెల్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, రోస్టన్ చేజ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్.
Series Decider 🤝 Super Sunday
All to play for in Florida as #TeamIndia takes on West Indies for the 5th & Final T20I 👌#WIvIND pic.twitter.com/RpGSxa6EN3
— BCCI (@BCCI) August 13, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..