IND vs WI 3rd ODI: తొలి రెండు వన్డేలు గెలిచిన భారత్.. సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీమిండియా క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది. వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్ శుక్రవారం జరగనుంది. మూడో మ్యాచ్‌కు ముందు టీమ్ మేనేజ్‌మెంట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను మారుస్తుందా? రెండు మ్యాచ్‌ల్లో బెంచ్‌పై కూర్చున్న ఆటగాళ్లకు రాహుల్ ద్రవిడ్ అవకాశం ఇస్తారా? అనేది ఆసక్తిగా మారింది. ఇషాన్ కిషన్, రితురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్‌లకు మొదటి రెండు మ్యాచ్‌లలో అవకాశం రాలేదు. దీంతె మూడో వన్డేలో ఈ ముగ్గురు ఆటగాళ్లకు అవకాశం కల్పించవచ్చని భావిస్తున్నారు.
తొలి రెండు వన్డేలు ఆడిన మహ్మద్ సిరాజ్ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌కు అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. శుభ్‌మన్ గిల్ స్థానంలో గైక్వాడ్‌కు అవకాశం కల్పించవచ్చు. మరోవైపు శ్రేయాస్ అయ్యర్ స్థానంలో ఇషాన్ కిషన్‌కు అవకాశం దక్కవచ్చు. ఈ మూడు మార్పులు ఇంకా నిర్ణయించబడలేదు.
వన్డే సిరీస్‌లో భారత జట్టు తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది. అయితే మూడో వన్డే ఎంతో ప్రత్యేకంగా ఉండనుంది. నిజానికి, వెస్టిండీస్‌పై భారత్ తమ స్వదేశంలో వన్డే సిరీస్‌లో ఎప్పుడూ క్లీన్‌స్వీప్ చేయలేదు. దీంతో ఈ అవకాశం ప్రస్తుతం టీమిండియా చేతుల్లోకి వచ్చింది.
మూడో వన్డేలో ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్ – ఇషాన్ కిషన్, రితురాజ్ గైక్వాడ్, శిఖర్ ధావన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, అవేశ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..