
భారత క్రికెట్ జట్టు 2023 సంవత్సరాన్ని విజయంతో ప్రారంభించింది. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా రెండు పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.శ్రీలంక జట్టు ధీటుగా పోరాడినప్పటికీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఈ థ్రిల్లింగ్ పోరులో అసలు హీరో కెరీర్ లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న శివమ్ మావీనే. మ్యాచ్ ఆద్యంతం అద్భుతంగా బౌలింగ్ చేసిన ఈ కుర్ర బౌలర్ లంకేయుల పని పట్టాడు. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే వికెట్లు తీసి పర్యాటక జట్టును ఒత్తిడిలోకి నెట్టాడు. ముందుగా పాతుమ్ నిస్సాంకాను అవుట్ చేసిన మావీ ఆ తర్వాత ధనంజయ్ డిసిల్వాను పెవిలియన్ పంపాడు. ఆతర్వాత క్రీజులో కుదురుకున్న ఆల్‌రౌండర్ వనిందు హసరంగ, మహేశ్ తీక్షణలను కూడా ఔట్ చేశాడు. మ్యాచ్‌లో మొత్తం 4 ఓవర్ల కోటా పూర్తి చేసిన మావి 22 రన్స్ ఇచ్చి 4 వికెట్ల పడగొట్టాడు. ఎకానమీ 5.5 మాత్రమే. టీమిండియా విజయంలో అతనిదే కీ రోల్.
ఈ మ్యాచ్ ద్వారా పలు రికార్డులు కొల్లగొట్టాడు శివమ్. 2009లో ప్రజ్ఞాన్ ఓజా బంగ్లాదేశ్‌పై అరంగేట్రం చేస్తూ 21 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత 2016లో జింబాబ్వేపై అరంగేట్రం చేసిన బరీందర్ శరణ్ 10 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడీ రికార్డును సమం చేశాడు మావి. 2018లో పృథ్వీ షా కెప్టెన్సీలో న్యూజిలాండ్‌లో జరిగిన అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులో మావి సభ్యుడు. అప్పటి నుంచి టీమిండియాలో స్థానం కోసం ఎదురుచూస్తున్నాడీ యంగ్ బౌలర్. ఐపీఎల్‌లో కోల్‌కతా తరఫున అమోఘంగా రాణించాడు. కాగా మ్యాచ్ అనంతరం మావీ మాట్లాడుతూ.. ‘ ఈ క్షణం కోసమే ఆరేళ్లుగా ఎదురుచూస్తున్నాను. కెరీర్ మధ్యలో నేను గాయాలపాలయ్యాను. దీంతో నా కల ఎప్పటికీ నెరవేరదని భావించాను. కానీ ఈ మ్యాచ్‌తో నాకల సాకారమైంది. నేను తీసిన తొలి వికెట్ నా ఫేవరెట్’ అని మురిసిపోయాడు మావి. కాగా అనారోగ్యంతో ఈ మ్యాచ్‌లో ఆడని అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో మావికి అవకాశం లభించింది. మావి ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడాడు . ఈ సీజన్‌లో అతనిని పాండ్యా కెప్టెన్సీ గుజరాత్ టైటాన్స్ ఆరు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.
For his brilliant bowling figures of 4/22 on his debut game, @ShivamMavi23 is our Top Performer from the second innings.
A look at his bowling summary here ??#INDvSL @mastercardindia pic.twitter.com/nkDyHeRLCo
— BCCI (@BCCI) January 3, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..