IND Vs SL: టీమిండియాకు ‘మ్యాక్స్‌వెల్’ దొరికేశాడోచ్.. 8 బంతుల్లో మ్యాచ్ మలుపు తిప్పిన ఐపీఎల్ స్టార్

|

Jul 28, 2024 | 10:23 AM

శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో చాలామంది ఆటగాళ్లు కీలక పాత్ర పోషించారు. వారిలో ఒకరు రియాన్ పరాగ్. బ్యాటింగ్ ఆర్డర్‌లో రియాన్ పరాగ్‌కు అవకాశం రాకపోయినా.. బౌలింగ్‌లో మాత్రం తన సత్తా చాటాడు. ఆ వివరాలు ఇలా..

IND Vs SL: టీమిండియాకు మ్యాక్స్‌వెల్ దొరికేశాడోచ్.. 8 బంతుల్లో మ్యాచ్ మలుపు తిప్పిన ఐపీఎల్ స్టార్
Ind Vs Sl
Follow us on

శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో చాలామంది ఆటగాళ్లు కీలక పాత్ర పోషించారు. వారిలో ఒకరు రియాన్ పరాగ్. బ్యాటింగ్ ఆర్డర్‌లో రియాన్ పరాగ్‌కు అవకాశం రాకపోయినా.. బౌలింగ్‌లో మాత్రం తన సత్తా చాటాడు. కేవలం 8 బంతుల్లోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. 214 పరుగుల లక్ష్యఛేదనలో భాగంగా బరిలోకి దిగిన శ్రీలంక జట్టుకు శుభారంభం లభించింది. ఆ జట్టు ఓపెనర్లు ఇద్దరూ మొదటి ఓవర్‌ నుంచి దూకుడైన ఆటతీరుతో పరుగుల వరద పారించారు. ఒకానొక దశలో మ్యాచ్ పూర్తిగా శ్రీలంక ఆధీనంలో ఉండగా.. గెలిచేది వాళ్లే అని అందరూ అనుకున్నారు. కానీ అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ వరుస ఇంటర్వెల్స్‌లో 3 వికెట్లు తీయడంతో భారత్ పునరాగమనం చేసింది. శ్రీలంక చేతిలో ఇంకా 6 వికెట్లు మిగిలి ఉండగా, 24 బంతుల్లో 56 పరుగులు చేయాల్సి ఉంది.

ఇలాంటి స్థితిలో కెప్టెన్ స్కై ఓ చక్కటి ప్రణాళిక రచించాడు. 17వ ఓవర్‌లో అర్ష్‌దీప్‌ సింగ్‌కి ఛాన్స్ ఇవ్వకుండా.. ఎడమచేతి వాటం ఆటగాడు కమిందు మెండిస్ స్ట్రైక్‌లో ఉన్నందున రియాన్ పరాగ్‌కి బౌలింగ్ ఇచ్చాడు. అనంతరం ఈ నిర్ణయం సరైనదని తేలింది. మొదటి బంతికి దసున్ షనక రనౌట్‌ కాగా.. పరాగ్ మూడవ బంతికి మెండిస్‌ను బౌల్డ్ చేశాడు. దీని తర్వాత 20వ ఓవర్లో పరాగ్ వరుసగా 2 బంతుల్లో 2 వికెట్లు పడగొట్టి శ్రీలంకను ఆలౌట్ చేశాడు.

ఇది చదవండి: బిల్డప్ బాబాయ్ అనుకునేరు.. బుల్డోజర్‌రా.! 22 సిక్సర్లతో ధోని శిష్యుడి ఊహకందని ఊచకోత.. ఎవరో తెల్సా

ఇవి కూడా చదవండి

సూర్య కెప్టెన్సీ ఇన్నింగ్స్..

శ్రీలంకను రెండో ఇన్నింగ్స్‌లో పరాగ్ ఓడించినప్పటికీ.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం టీమ్ ఇండియా విజయానికి ముందుగానే స్క్రిప్ట్‌ రచించాడు. అతడు కేవలం 26 బంతుల్లో 223 స్ట్రైక్ రేట్‌తో 58 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో టీమ్‌ఇండియా 213 పరుగుల భారీ స్కోరును అందుకోగలిగింది. సూర్య తనదైన శైలిలో తుఫాను బ్యాటింగ్ చేసి శ్రీలంకపై ఒత్తిడి తీసుకొచ్చాడు. అతడు కేవలం 22 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌కు సూర్యకుమార్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

ఇది చదవండి: ప్రైవేట్ పార్టులో నొప్పంటూ ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. ఎక్స్‌రే తీసి చూడగా కళ్లు బైర్లు

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..