ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న టీమిండియా.. మొదటిగా టీ20లు, ఆ తర్వాత వన్డేలు ఆడనుంది. హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఫస్ట్ అసైన్‌మెంట్ ఇది. కేవలం యంగ్ ప్లేయర్స్ మాత్రమే కాదు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో పాటు టీ20 ప్రపంచకప్‌లో పాల్గొన్న దాదాపు అందరూ కూడా ఈ టూర్‌లో భాగమయ్యారు. కేవలం జస్ప్రీత్ బుమ్రాకు మాత్రమే విశ్రాంతి లభించింది. జూలై 27 నుంచి శ్రీలంకతో టీ20 సిరీస్ ప్రారంభం కానుండగా.. ఈలోగానే టీమిండియాకు ఓ బ్యాడ్‌న్యూస్ వచ్చేసింది. ప్రాక్టీస్ చేస్తుండగా సీనియర్ బౌలర్ మహ్మద్ సిరాజ్ గాయపడ్డాడు.
ఇది చదవండి: బిల్డప్ బాబాయ్ అనుకునేరు.. బుల్డోజర్‌రా.! 22 సిక్సర్లతో ధోని శిష్యుడి ఊహకందని ఊచకోత.. ఎవరో తెల్సా
2024 టీ20 ప్రపంచకప్‌లో భాగమైన మహ్మద్ సిరాజ్.. శ్రీలంకలో జస్ప్రిత్ బుమ్రా లేని పేస్ ఎటాక్‌కు సారధ్యం వహించనున్నాడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రాక్టీస్ సెషన్‌లో సిరాజ్ కాలికి తీవ్ర గాయమైంది. అతడికి సత్వరమే వైద్య చికిత్స అందించగా.. ఆ తర్వాతి సెషన్‌లో సిరాజ్ పాల్గొనలేదని తెలుస్తోంది. అలాగే జూలై 27న శ్రీలంకతో జరగబోయే తొలి టీ20లోనూ సిరాజ్ పాల్గొనడం డౌటేనని టీం మేనేజ్‌మెంట్ చెబుతోంది. మొదటి అసైన్‌మెంట్‌నే విజయంతో మొదలుపెడదామనుకున్న గౌతమ్ గంభీర్‌కు ఇలా సీనియర్ బౌలర్ గాయంతో పెవిలియన్‌కు చేరడం ఇబ్బందికర అంశమే.
ఇది చదవండి: ఈ ఫోటోలో మొదట మీకేం కనిపిస్తోంది.. అదే మీ వ్యక్తిత్వాన్ని చెబుతుందట
ఈ పర్యటనలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో మాత్రమే శ్రీలంకకు వచ్చారు. శ్రీలంకతో తొలి మ్యాచ్‌లో ఖలీల్ అహ్మద్, అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు సిరాజ్ స్థానంలో ఆవేశ్ ఖాన్ లేదా ముఖేష్ కుమార్‌లో ఒకరు ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది.
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రింకు సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్ మహ్మద్ సిరాజ్.
ఇది చదవండి: ప్రైవేట్ పార్టులో నొప్పంటూ ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. ఎక్స్‌రే తీసి చూడగా కళ్లు బైర్లు
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..