
India vs Sri Lanka, Asia Cup 2023 Final Match Report: 8వ ఆసియా కప్ టైటిల్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకపై ఆ జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఎక్కువ బంతులు మిగిలి ఉండగానే వన్డేల్లో భారత్‌కు ఇదే వేగవంతమైన విజయంగా నిలిచింది. అంతకుముందు 2001లో కెన్యాపై టీమిండియా 231 బంతుల తేడాతో విజయం సాధించింది. 50 ఓవర్ల వన్డేలో అత్యంత వేగంగా విజయం సాధించిన జట్టుగా శ్రీలంక రికార్డు సృష్టించింది. శ్రీలంక జట్టు 2001లో జింబాబ్వేను 274 బంతులు మిగిలి ఉండగానే ఓడించింది. అయితే ఓవరాల్ రికార్డు మాత్రం ఇంగ్లండ్ పేరిట ఉంది. 1979లో కెనడాతో జరిగిన 60 ఓవర్ల మ్యాచ్‌లో ఇంగ్లీష్ జట్టు మరో 277 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.
కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 15.2 ఓవర్లలో 50 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఛేదనలో టీమిండియా 6.1 ఓవర్లలో 51 పరుగులు పూర్తి చేసి, 8వ సారి ఆసియా విజేతగా నిలిచింది.
𝙒𝙃𝘼𝙏. 𝘼. 𝙒𝙄𝙉! 😎
A clinical show in the summit clash! 👌👌
A resounding 10-wicket win to clinch the #AsiaCup2023 title 👏👏
Well done, #TeamIndia! 🇮🇳#INDvSL pic.twitter.com/M9HnJcVOGR
— BCCI (@BCCI) September 17, 2023
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్(కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలాగే, దుషన్ హేమంత, ప్రమోద్ మదుషన్, మతీషా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..