భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆటకు బౌలర్లకు నిలయంగా మారింది. డే-నైట్ టెస్టు తొలి రోజు మొత్తం 16 వికెట్లు పడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత జట్టు 252 పరుగులకు ఆలౌటైంది. శ్రేయాస్ అయ్యర్ (92) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రిషబ్ పంత్ 39, హనుమ విహారి 31 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు లసిత్ ఎంబుల్దేనియా, ప్రవీణ్ జయవిక్రమ చెరో 3 వికెట్లు తీశారు.
సమాధానంగా, శ్రీలంక ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 86 పరుగులు మాత్రమే చేసింది. లసిత్ ఎంబుల్దేనియా 0, నిరోషన్ డిక్వెల్లా 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా 3, మహ్మద్ షమీ 2 వికెట్లు పడగొట్టారు. అదే సమయంలో అక్షర్ పటేల్ 1 వికెట్ తీశాడు. శ్రీలంక టీం ఇంకా 166 పరుగులు వెనుకంజలోనే నిలిచింది.
రెండు జట్లు:
భారత ప్లేయింగ్ XI : రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ, హనుమ విహారి, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా
శ్రీలంక ప్లేయింగ్ XI : దిముత్ కరుణరత్నే, లహిరు తిరిమన్నె, కుసల్ మెండిస్, చరిత్ అస్లాంక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ్ డి సిల్వా, నిరోషన్ డిక్వెల్లా, సురంగ లక్మల్, విశ్వ ఫెర్నాండో, లసిత్ ఎంబుల్దెనియా, పి. జయవిక్రమ
రెండు టెస్ట్ మ్యాచుల్ సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచులో కూడా గెలిచి మరో క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది.
రోహిత్ శర్మ 400వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నాడు. తొలిసారి పింక్ బాల్ టెస్టుకు సారథ్యం వహిస్తున్నాడు.
భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆటకు బౌలర్లకు నిలయంగా మారింది. డే-నైట్ టెస్టు తొలి రోజు మొత్తం 16 వికెట్లు పడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత జట్టు 252 పరుగులకు ఆలౌటైంది. శ్రేయాస్ అయ్యర్ (92) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రిషబ్ పంత్ 39, హనుమ విహారి 31 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు లసిత్ ఎంబుల్దేనియా, ప్రవీణ్ జయవిక్రమ చెరో 3 వికెట్లు తీశారు.
సమాధానంగా, శ్రీలంక ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 86 పరుగులు మాత్రమే చేసింది. లసిత్ ఎంబుల్దేనియా 0, నిరోషన్ డిక్వెల్లా 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా 3, మహ్మద్ షమీ 2 వికెట్లు పడగొట్టారు. అదే సమయంలో అక్షర్ పటేల్ 1 వికెట్ తీశాడు. శ్రీలంక టీం ఇంకా 166 పరుగులు వెనుకంజలోనే నిలిచింది.
బుమ్రా బౌలింగ్‌లో మాథ్యూస్(43) పెవిలియన్ చేరాడు. రెండో రోజు ఆట కొద్ది నిమిషాల్లో ముగిసే సమయంలో బుమ్రా లంక టీంను దెబ్బ తీశాడు. దీంతో 85 పరుగుల వద్ద లంక టీం 6వ వికెట్‌ను కోల్పోయింది. ఇంకా 167 పరుగుల వెనుకంజలోనే నిలిచింది.
ధనంజయ(10) రూపంలో శ్రీలంక టీం నాలుగో వికెట్‌ను కోల్పోయింది. బుమ్రా 2, మహ్మద్ షమీ 2 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం శ్రీలంక టీం 12 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 28 పరుగులు చేసింది.
తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన లంక టీం వెంటవెంటనే వికెట్లు కోల్పోతూ కష్టాల్లోకి కూరకపోతోంది. కుసాల్ మెండిస్ 2, దిముత్ కరుణరత్నే 4, లాహిరు తిరుమన్నె 8 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. బుమ్రా 2, మహ్మద్ షమీ 1 వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం శ్రీలంక టీం 8.5 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 18 పరుగులు చేసింది.
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్ 59.1 ఓవర్లలో 252 పరుగులకు కుప్పకూలింది. శ్రేయాస్ అయ్యర్ అత్యధికంగా 92 పరుగులు చేశాడు. చివరి వికెట్‌గా అవుటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో అయ్యర్ 10 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు. రిషబ్ పంత్ 39, హనుమ విహారి 31 పరుగులు చేశారు.
అక్షర్ పటేల్(9) రూపంలో టీమిండియా 8వ వికెట్‌ను కోల్పోయింది. లక్మాల్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ప్రస్తుతం టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 60 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
శ్రేయాస్ అయ్యర్ 54 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో తన అర్థ సెంచరీ పూర్తి చేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో అద్బుతంగా ఆడుతూ అక్షర్ పటేల్‌తో కలిసి టీం స్కోర్‌ను కూడా 200 పరుగులకు చేర్చాడు. ప్రస్తుతం టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 54, అక్షర్ పటేల్ 9 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
విరాట్ కోహ్లీ(23 పరుగులు, 2 ఫోర్లు) 4వ వికెట్‌గా పెవిలియన్ చేరాడు. వరుసగా వికెట్లు కోల్పోతూ భారత్ కష్టాల్లో కూరకపోతోంది. ఇప్పటికే అగర్వాల్, రోహిత్, విహారి పెవిలియన్ చేరారు. తాజాగా కోహ్లీ కూడా ఎల్బీగా ఔటవ్వడంతో భారమంతా పంత్, శ్రేయాస్ అయ్యర్‌లపైనే నిలిచింది. భారత్ 86 పరుగుల వద్ద 4వ వికెట్‌ను కోల్పోయింది.
హనుమ విహారి(31 పరుగులు, 4 ఫోర్లు) 3వ వికెట్‌గా పెవిలియన్ చేరాడు. విరాట్ కోహ్లీతో కలిసి అర్థ సెంచరీ భాగస్వామ్యం దిశగా సాగుతోన్న విహారిని జయవిక్రమ ఔట్ చేశాడు. దీంతో భారత్ 76 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. విరాట్ కోహ్లీ 23 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
రోహిత్ శర్మ(15) రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. 400వ మ్యాచ్ ఆడుతున్న రోహిత్, స్పెషల్‌గా ఏం చేయలేకపోయాడు. దీంతో 29 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్‌ను కోల్పోయింది.
పింక్ బాల్ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఆరంభించింది. అయితే, ఆదిలోనే టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫెర్నాండో బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్(4) రనౌట్‌గా వెనుదిరిగాడు. టీమిండియా 10 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది.