మొహాలి వేదికగా శ్రీలంకతో జరిగిన మొదటి టెస్ట్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో విజయం సాధించి 2 మ్యాచ్‌ల సిరీస్ లో 1-0 ఆధిక్యం సంపాదించింది. మూడో రోజు ఫాలోఆన్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక 178 పరుగులకు ఆలౌటౌంది. జడేజా, అశ్విన్‌లు చెరో 4 వికెట్లతో లంకేయులను తిప్పేశారు. అంతకుముందు మూడో రోజు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకు ఆలౌటైంది. పాతుమ్ నిశాంక 61 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారత్ తరఫున రవీంద్ర జడేజా 5 వికెట్లు తీశాడు. అదే సమయంలో ఆర్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా చెరో 2 వికెట్లు తీశారు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
మొహాలీ టెస్టులో శ్రీలంక జట్టు కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 574 పరుగుల వద్ద భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన తర్వాత రెండో రోజు ఆట ముగిసే సమయానికి 108 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆట సాగుతున్న కొద్దీ, మొహాలి పిచ్ మలుపు తిరుగుతోంది. ఇది భారత స్పిన్నర్లను పూర్తిగా ఉపయోగించుకుంటూ వికెట్లు పడగొడుతున్నారు. ఇదే జరిగితే శ్రీలంక కూడా ఫాలో ఆన్ ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉంది.
ఇండియా ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ, హనుమ విహారి, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, అశ్విన్, జయంత్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా
శ్రీలంక ప్లేయింగ్ XI: దిముత్ కరుణరత్నే, లహిరు తిరిమన్నె, పాతుమ్ నిసంక, చరిత్ అస్లాంక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ్ డి సిల్వా, నిరోషన్ డిక్వెల్లా, సురంగ లక్మల్, విశ్వ ఫెర్నాండో, లసిత్ ఎంబుల్దెనియా, లహిరు కుమార
రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్‌లో 108 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 8 వికెట్లకు 574 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.
మొహాలీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అజేయంగా 175 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్‌లో నం.1గా మారాడు.
మొహాలి వేదికగా శ్రీలంకతో జరిగిన మొదటి టెస్ట్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో విజయం సాధించి 2 మ్యాచ్‌ల సిరీస్ లో 1-0 ఆధిక్యం సంపాదించింది. మూడో రోజు ఫాలోఆన్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక 178 పరుగులకు ఆలౌటౌంది. జడేజా, అశ్విన్‌లు లంకేయులను తిప్పేశారు.
శ్రీలంకతో జరుగుతోన్న మొదటి టెస్ట్‌లో టీమిండియా విజయం ముంగిట నిలిచింది. విశ్వ ఫెర్నాండో (0)ను షమి ఔట్ చేశాడు. ప్రస్తుతం లంక స్కోరు 56 ఓవర్లలో 172/9. టీమిండియా విజయం సాధించేందుకు మరో వికెట్ అవసరం. ఇంకా నేటి ఆటలో 10 ఓవర్లు ఉన్నాయి.
శ్రీలంక జట్టు ఎనిమిదో వికెట్ కోల్పోయింది. డిఫెన్స్ బ్యాటింగ్ తో వికెట్లకు అడ్డుగోడలా నిలిచిన ఎంబుల్డేనియాను జడేజా ఔట్ చేశాడు. మరోవైపు డిక్ వెల్లా (33) నిలకడగా ఆడుతున్నాడు. అతనికి తోడుగా విశ్వా ఫెర్నాండో (0) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం లంక స్కోరు 52 ఓవర్లలో 156/8. నేటి ఆటలో ఇంకా 14 ఓవర్లు మిగిలి ఉన్నాయి.
ధాటిగా ఆడుతోన్న అసలంక (9 బంతుల్లో 20)ను ఔట్ చేయడం ద్వారా అశ్విన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. టెస్టుల్లో టీమిండియా తరఫున రెండో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఈక్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (434) వికెట్ల రికార్డును అధిగమించాడు. అనిల్ కుంబ్లే 619 వికెట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు.
మొదటి టెస్ట్ లో విజయం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది టీమిండియా. రెండో ఇన్నింగ్స్ లోనూ లంకేయులను కుదురుకోనివ్వడం లేదు. అశ్విన్, జడేజా వరుస విరామాల్లో వికెట్లు తీస్తున్నారు. సీనియర్ బ్యాటర్ మాథ్యూస్ (28), లక్మల్ (0) వెంటవెంటనే పెవిలియన్ కు చేరారు. దీంతో 39 ఓవరల్లో లంక స్కోరు 130/7 గా ఉంది.
ఫాలో ఆన్ ఆడుతోన్న లంకేయులను టీమిండియా స్పిన్నర్లు తిప్పేస్తున్నారు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తున్నారు. 9బంతుల్లో 20 (రెండు ఫోర్లు, రెండు సిక్స్ లు) పరుగులు సాధించి ధాటిగా ఆడుతోన్న అసలంకను అశ్విన్ బోల్తా కొట్టించాడు. ప్రస్తుతం లంక స్కోరు 36 ఓవర్లలో 121/5.
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మూడో రోజు రెండో సెషన్ ఆట ముగిసింది. ఫాలోఆన్ ఆడుతున్న లంక రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. మాథ్యూస్ (27), అసలంక(20) క్రీజులో ఉన్నారు. మూడో సెషన్ ఆటలో సుమారు 31 ఓవర్లు మిగిలి ఉన్నాయి. కాబట్టి శ్రీలంక బ్యాటర్లు అద్భుతంగా పోరాడితే తప్ప టీమిండియా విజయం నేడే ఖరారు కావచ్చు.
అర్ధ సెంచరీ భాగస్వామ్యం దిశగా సాగుతున్న ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డిసిల్వా జోడిని రవీంద్ర జడేజా విడగొట్టాడు. నిలకడగా ఆడుతున్న డిసిల్వాను (30) ఔట్ చేసి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. ప్రస్తుతం లంక స్కోరు 34 ఓవర్లలో 100/4 గా ఉంది. మాథ్యూస్ (27), అసలంక (6) క్రీజులో ఉన్నారు.
రెండో ఇన్నింగ్స్‌లోనూ శ్రీలంక తడబడుతోంది. వరసుగా వికెట్లు కోల్పోతూ ఫాలో ఆన్ కూడా తప్పించుకునేట్లు కనిపించడం లేదు. టీం స్కోర్ 45 పరుగుల వద్ద కరుణరత్నే, షమీ బౌలింగ్‌లో పంత్ చేతికి చిక్కాడు.
రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన శ్రీలంక టీం.. తొలి ఇన్నింగ్స్ బాటలోనే నడుస్తోంది. లంచ్ తరువాత రెండో వికెట్‌ను కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో నిస్సాకం(6) పెవిలియన్ చేరాడు. అశ్విన్ కెరీర్‌లో 434 వికెట్లు పడగొట్టాడు. దీంతో కపిల్ దేవ్ రికార్డును సమం చేశాడు.
రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన శ్రీలంక టీం.. తొలి ఇన్నింగ్స్ బాటలోనే నడుస్తోంది. 400 పరుగుల వెనుకంజలోనే నిలిచిన శ్రీలంక.. కేవలం 9 పరుగులు చేసిన వెంటనే తొలి వికెట్‌ను కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో లహిరు(0) పెవిలియన్ చేరాడు. అశ్విన్ కెరీర్‌లో 433 వికెట్లు పడగొట్టాడు. మరో వికెట్ తీస్తే కపిల్ దేవ్ రికార్డును సమం చేయనున్నాడు.
మొహాలీ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకు ఆలౌటైంది. పాతుమ్ నిశాంక 61 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారత్ తరఫున రవీంద్ర జడేజా 5 వికెట్లు తీశాడు. అదే సమయంలో ఆర్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా చెరో 2 వికెట్లు తీశారు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
63.3 వ ఓవర్లో షమీ బౌలింగ్‌లో ఎంబుల్డినియా(0) ఎనిమిదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో 173 పరుగుల వద్ద లంక టీ 8వ వికెట్‌ను కోల్పోయి అత్యల్ప స్కోర్‌కే ఆలౌట్ అయ్యే ప్రమాదంలో పడింది. దీంతో లంక టీం ఫాలో ఆన్ దిశగా సాగుతోంది.
మొహాలీ టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. 60వ ఓవర్ వేసిన జడేజా.. నాలుగో బంతికి డిక్విల్లా (2), చివరి బంతికి లక్మాల్(0) ను పెవిలియన్ చేర్చాడు. దీంతో 164 పరుగుల వద్ద లంక టీం 7వ, 8వ వికెట్లను కోల్పోయింది.
మొహాలీ టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. మూడోరోజు ఆటలో అసలంక (29) పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్ చేరిన కొద్దసేపటికే డిక్విల్లా(2) పరుగుల వద్ద జడేజా చేతికి చిక్కాడు. దీంతో 164 పరుగుల వద్ద లంక టీం 6వ వికెట్‌ను కోల్పోయింది.
మొహాలీ టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. మూడోరోజు ఆట మొదలైన కొద్దిసేపటికే అసలంక 29 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో 161 పరుగుల వద్ద లంక టీం 5వ వికెట్‌ను కోల్పోయింది.
శ్రీలంక ఆశలు చరిత అసలంక, పాతుమ నిసంకలపైనే ఉన్నాయి. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును బలమైన స్కోరుకు తీసుకెళ్లేందుకు భారీ భాగస్వామ్యం చేయాలని జట్టు భావిస్తోంది. నిశాంక 26 పరుగులు, అసలంక ఒక పరుగుతో బ్యాటింగ్‌కు దిగారు.
భారత గ్రేట్ బౌలర్ కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టేందుకు రవిచంద్రన్ అశ్విన్ చేరువలో ఉన్నాడు. టెస్టుల్లో కపిల్ 434 వికెట్లు, అశ్విన్ 432 వికెట్లు తీశారు. మూడో రోజు కపిల్ రికార్డును అశ్విన్ బ్రేక్ చేసేందుకు అవకాశం ఉంది.
మొహాలీ వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో నేడు మూడో రోజు. ఇప్పటి వరకు జరిగిన ఆటతీరును పరిశీలిస్తే.. ఈ మ్యాచ్‌లో భారత్ జోరుమీదుంది. ఆతిథ్య జట్టులోని బ్యాట్స్‌మన్స్, బౌలర్లు ఇద్దరూ ఇప్పటివరకు బలమైన ఆటను కనబరిచారు. నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులతో శ్రీలంక మూడో రోజు ఆట ప్రారంభించింది. మరి నేడు లంక ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.