ind vs sl: 13వ ఓవర్‌లో సిక్సర్ల వర్షం కురిపించిన భారత ఆటగాడు.. కానీ చివరి బంతికి ఏమైందంటే..
టీ 20 ప్రపంచకప్‌కు సన్నాహాల్లో నిమగ్నమైన టీమ్ ఇండియా కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడంతో పాటు..
టీ 20 ప్రపంచకప్‌కు సన్నాహాల్లో నిమగ్నమైన టీమ్ ఇండియా కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడంతో పాటు, కొత్త ఆటగాళ్లకు నిరంతరం అవకాశాలు ఇస్తోంది. ఇందులో కొంతమంది ఆటగాళ్లు ఉన్నారు. వారి పేరు గత కొన్నేళ్లుగా భారత క్రికెట్‌లో నిరంతరంగా వినిపిస్తోంది.. కానీ వారు టీమ్ ఇండియాలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంలో విఫలమవుతోన్నారు. అందులో ఒకరు వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్(sansju samson). T20 క్రికెట్‌లోని అత్యంత ప్రభావంతమైన బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన సంజు శ్రీలంకతో టీ20 సిరీస్(IND vs SL)కు ఎంపికయ్యాడు. ధర్మశాలలో(Dharmashala) జరిగిన మ్యాచ్‌లో అతడికి అవకాశం వచ్చింది. దీంతో అతను తనేంటో నిరూపించుకున్నాడు. ఓ ఓవర్లో సిక్సర్ల వర్షం కురిపించాడు.
ఫిబ్రవరి 26, శనివారం ధర్మశాలలో జరిగిన టీ20 సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో శ్రీలంక నుండి 184 పరుగుల లక్ష్యాన్ని భారత్ పేలవంగా ప్రారంభించింది. గత మ్యాచ్‌లో వేగంగా బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ తొందరగా పెవిలియన్ చేరారు. అటువంటి పరిస్థితిలో బాధ్యత శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్‌లపై పడింది. అయ్యర్ గత మ్యాచ్‌లో బలంగా బ్యాటింగ్ చేయడంతో శాంసన్‌కు అవకాశం రాలేదు. అలాంటి పరిస్థితుల్లో ఈసారి శాంసన్‌కి అవకాశం వచ్చింది.
సిక్సర్ల వర్షం, తర్వాత సంచలన క్యాచ్
నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించిన సంజూ శాంసన్ చాలా సేపటి వరకు స్ట్రయిక్ రేట్ 100ను కూడా అందుకోలేకపోయాడు. అయ్యర్ మాత్రమే వేగంగా బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత 13వ అంతా మారిపోయింది. ఫాస్ట్ బౌలర్ లహిరు కుమార వేసిన ఈ ఓవర్లో సంజూ తొలి, రెండో బంతుల్లో ఫోర్లు, సిక్సర్ల బాదాడు. తర్వాతి బంతి వైడ్ వేశాడు బౌలర్. ఇక మూడో బంతికి కూడా గట్టి సిక్స్ కొట్టి సంజూ ఐదో బంతికి సిక్స్ కొట్టాడు. ఆఖరి బంతికి ఔటయ్యాడు. స్లిప్‌లో ఫెర్నాండో అద్భుతమైన క్యాచ్‌కు సంజు పెవిలియన్ చేరాడు.
ఈ భారత బ్యాట్స్‌మెన్ తన సామర్థ్యానికి లోటు లేదని.. తనకి కేవలం అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని మళ్లీ చూపించాడు. సంజు తన ఇన్నింగ్స్‌లో 25 బంతుల్లో 3 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 39 పరుగులు చేశాడు. అతను శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి మూడో వికెట్‌కు 84 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు, ఇది భారత్ విజయాన్ని సులభం చేసింది.
Read Also.. IND vs SL: టీమిండియాకు ఎదురు దెబ్బు.. బౌన్సర్ తగిలి ఆస్పత్రికి చేరిన ఆటగాడు..