IND vs SL 1st ODI: రోహిత్‌తో ఓపెనింగ్ చేసేది అతడే.. ఆ ‘స్పీడ్’కు బ్రేకులు.. లంకతో తలపడే భారత ప్లేయింగ్ XI ఇదే..

|

Jan 09, 2023 | 9:35 AM

IND vs SL 1st ODI, India Playing 11: భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య జనవరి 10న గౌహతిలో తొలి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌పై ఆసక్తి నెలకొంది.

IND vs SL 1st ODI: రోహిత్‌తో ఓపెనింగ్ చేసేది అతడే.. ఆ స్పీడ్కు బ్రేకులు.. లంకతో తలపడే భారత ప్లేయింగ్ XI ఇదే..
Ind Vs Sl india playing 11
Follow us on

India vs Sri Lanka 1st ODI Playing 11: టీ20 సిరీస్ గెలిచి మాంచి ఊపులో ఉన్న టీమిండియా.. ఇప్పుడు వన్డే సిరీస్‌ని కూడా కైవసం చేసుకోవాలనుకుంటోంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, శ్రీలంక మధ్య జనవరి 10న గౌహతిలో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు. ఎందుకంటే, ఈ మ్యాచ్‌తో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లాంటి సీనియర్లు జట్టులో చేరనున్నారు. అలాగే బుమ్రా, షమీ లాంటి సీనియర్ బౌలర్లు కూడా జట్టులో చేరనుండడంతో, ప్లేయింగ్ 11లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.

ఓపెనర్లుగా రోహిత్, ఇషాన్..

శ్రీలంకతో జరిగే తొలి వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేయగలడని తెలుస్తోంది. బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి వన్డేలో ఇషాన్ డబుల్ సెంచరీ సాధించాడు. ఇటువంటి పరిస్థితిలో శుభమాన్ గిల్ బెంచ్ మీద కూర్చోవలసి ఉంటుంది.

మిడిల్ ఆర్డర్ ఇలా..

మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో నంబర్‌లో ఆడటం ఖాయయని తెలుస్తోంది. అదే సమయంలో సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలో, కేఎల్ రాహుల్ 5వ స్థానంలో, హార్దిక్ పాండ్యా 6వ స్థానంలో బరిలోకి దిగనున్నారు. ఆ తర్వాత నంబర్లలో యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్ బ్యాటింగ్‌కు రానున్నారు.

ఇవి కూడా చదవండి

ఫాస్ట్ బౌలర్ల గురించి మాట్లాడితే, గౌహతిలో జరిగే మొదటి వన్డేలో టీమిండియా ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగనుందని తెలుస్తోంది. ఇందులో మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, ఉమ్రాన్ మాలిక్ ఉండవచ్చని భావిస్తున్నారు.

తొలి వన్డేలో బరిలోకి దిగే టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఇదే..

ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, ఉమ్రాన్ మాలిక్.

వన్డే సిరీస్‌కు టీమిండియా స్వ్కాడ్ : రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..