Watch Video: ఒక బంతికి రెండు షాట్లు.. దటీజ్ పంత్.. దక్షిణాఫ్రికా పేసర్ ఆగ్రహానికి గట్టిగా రిప్లై ఇచ్చిన భారత కీపర్..!

|

Jan 13, 2022 | 8:27 PM

Rishabh Pant: కేప్ టౌన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా బౌలర్లు భారత ఇన్నింగ్స్‌ను చిత్తు చేసినప్పటికీ రిషబ్ పంత్ బ్యాటింగ్ మాత్రం బలంగానే కొనసాగింది.

Watch Video: ఒక బంతికి రెండు షాట్లు.. దటీజ్ పంత్.. దక్షిణాఫ్రికా పేసర్ ఆగ్రహానికి గట్టిగా రిప్లై ఇచ్చిన భారత కీపర్..!
Ind Vs Sa; Rishabh Pant
Follow us on

India Vs South Africa, Cape Town Test: భారత్, దక్షిణాఫ్రికా మధ్య కేప్ టౌన్ టెస్ట్ (India Vs South Africa 2021) ఉత్తేజకరమైన మలుపులో ఉంది. మ్యాచ్ మూడవ రోజు, దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్లు భారత ఇన్నింగ్స్‌ను ముగించారు. దక్షిణాఫ్రికా యువ పేసర్ మార్కో యాన్సన్(Marco Jansen) ముఖ్యంగా టీమిండియా బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు. అయితే భారత్ నుంచి యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్(Rishabh Pant) కూడా ఈ లిస్టులో ఉన్నాడు. దక్షిణాఫ్రికా బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొన్నాడు. ఈ సమయంలో, యాన్సన్, పంత్ చాలాసార్లు ముఖాముఖిగా తలపడ్డారు. ఇద్దరూ తమ సామర్థ్యాలను చూపించారు. పంత్‌పై యాన్సన్ దూకుడు వైఖరిని ప్రదర్శించిన సందర్భం ఒకటి నెట్టింట్లో సందడి చేస్తోంది. దానికి పంత్ ‘ఒకే బంతిపై రెండు షాట్లు’ ఆడటం ద్వారా గట్టిగా సమాధానమిచ్చాడు.

భారత్‌తో జరిగిన ఇదే సిరీస్‌లో అరంగేట్రం చేసిన 21 ఏళ్ల ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ మార్కో యాన్సన్, ప్రతి ఇన్నింగ్స్‌లో తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్‌లను తీవ్రంగా ఇబ్బందులు పెట్టాడు. కేప్ టౌన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని నిరంతరం కష్టాల్లో పడేస్తూ యాన్సన్ బౌలింగ్ చేశాడు. కేఎల్ రాహుల్, ఛెతేశ్వర్ పుజారా వంటి దిగ్గజాల వికెట్లు కూడా పడగొట్టాడు. అయినప్పటికీ, పంత్ ముందు పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. దాంతో ఆగ్రహించిన యాన్సన్ దాడికి దిగాడు.

యాన్సన్‌కి పంత్ సరైన సమాధానం..
లంచ్ తర్వాత, రెండో సెషన్‌లో బ్యాటింగ్ చేస్తున్న పంత్ ముందు యాన్సన్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. భారత ఇన్నింగ్స్‌లో అది 50వ ఓవర్. ఈ ఓవర్‌లో తొలి ఐదు బంతులను పంత్ సులువుగా ఆడాడు. ఆ తర్వాత ఓవర్ చివరి బంతికి పంత్ బౌలర్ వైపు తిరిగి డిఫెన్సివ్ పంచ్ ఆడాడు. ఈ సమయంలో, పంత్ తన షాట్ ఆడిన తర్వాత డిఫెన్సివ్ పొజిషన్‌లో ఉన్నాడు. క్రీజులో ఉన్నాడు.

కానీ, యాన్సన్ బంతిని పట్టుకున్న వెంటనే, కోపంతో పంత్ వైపు తిరిగి విసిరాడు. పంత్ కూడా తగిన సమాధానమిచ్చి, యాన్సన్ విసిరిన బంతిని మళ్లీ బ్యాట్‌తోనే కొట్టాడు. పంత్ ఈ శైలిని చూసి, వ్యాఖ్యాతలు కూడా నవ్వడం ప్రారంభించారు. భారత బ్యాట్స్‌మెన్‌ను ప్రశంసించడం ప్రారంభించారు.

సెంచరీతో ఆకట్టుకున్న పంత్..
198 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది. దీంతో సౌతాఫ్రికా ముందు 212 పరుగుల టార్గెట్ ఉంది. భారత ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ 100* నాటౌట్‌గా నిలిచి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రిషబ్ పంత్ దక్షిణాఫ్రికాలో తన తొలి సెంచరీని పూర్తిచేసుకున్నాడు. 133 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో వంద పరుగులు పూర్తి చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ పెద్దగా రాణించలేకపోవడంతో 198 పరుగులకే భారత్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. ఈ టెస్టులో గెలవాలంటే భారం అంతా బౌలర్లపైనే నిలిచింది.

Also Read: IND vs SA: కేప్ టౌన్‌లో అదరగొట్టిన రిషబ్ పంత్.. సెంచరీతో కీలక ఇన్నింగ్స్..!

IND vs SA: కేప్ టౌన్‌ టెస్ట్‌తో వీరిద్దరి కెరీర్‌కు ముగింపు? మిడిలార్డర్‌లో మార్పులకు ఇదే శుభతరుణం అంటోన్న మాజీలు