IND vs SA: ‘జై శ్రీరామ్’ అంటూ సౌతాఫ్రికా ప్లేయర్ ట్వీట్.. నెట్టింట్లో వైరల్.. ఎందుకంటే?

|

Jan 25, 2022 | 7:11 AM

Keshav Maharaj: వన్డే సిరీస్‌లో టీమిండియాపై సాధించిన భారీ విజయంపై సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ సంతోషం వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ చేశాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

IND vs SA: జై శ్రీరామ్ అంటూ సౌతాఫ్రికా ప్లేయర్ ట్వీట్.. నెట్టింట్లో వైరల్.. ఎందుకంటే?
Ind Vs Sa Series
Follow us on

IND Vs SA: వన్డే సిరీస్‌లో (India Vs South Africa) దక్షిణాఫ్రికా 3-0తో టీమిండియాను క్లీన్ స్వీప్ చేసిన తీరు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌ నుంచే తక్కువగా అంచనా వేశారు. కానీ, దాని ఆటగాళ్లు అద్భుత ఆటతీరుతో ఆకట్టకున్నారు. మొదట టెస్ట్ సిరీస్‌లో టీమిండియా(Team India)ను ఓడించారు. ఆ తర్వాత వారు ఏకపక్ష పద్ధతిలో వన్డే సిరీస్‌ను కూడా గెలుచుకున్నారు. వన్డే సిరీస్ గురించి మాట్లాడితే, ఎడమచేతి వాటం స్పిన్నర్ కేశవ్ మహరాజ్ దక్షిణాఫ్రికా విజయంలో కీలకంగా వ్యవహరించాడు. వన్డే సిరీస్ విజయం తర్వాత కేశవ్ మహరాజ్(Keshav Maharaj) సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. భారతదేశంపై విజయం సాధించిన తర్వాత కేశవ్ మహాజా ‘జై శ్రీరామ్’ అని ఆపోస్టులోరాసుకొచ్చాడు.

‘వాట్‌ ఏ సిరీస్.. ఇంత దూరం వచ్చినందుకు ఈ జట్టు గర్విస్తోంది. తదుపరి సిరీస్‌కు సిద్ధమయ్యే సమయం వచ్చింది. జై శ్రీరామ్’ అంటూ ట్వీట్ చేశాడు. కేశవ్ మహారాజ్ దక్షిణాఫ్రికా తరపున ఆడుతున్నాడు. కానీ, అతను భారతీయ సంస్కృతితో ముడిపడి ఉన్నాడు. కేశవ మహారాజ్ ఆలయానికి వెళ్తూ ఉంటాడు. కేశవ్ మహరాజ్ హనుమంతునికి గొప్ప భక్తుడు ఉన్నాడు.

కేశవ్ మహారాజ్ సుల్తాన్‌పూర్‌కు బంధువు..
కేశవ మహారాజ్ పూర్వీకులు యుపిలోని సుల్తాన్‌పూర్‌లో నివసించారు. 1874లో, కేశవ్ మహారాజ్ తండ్రి తాత డర్బన్‌లో స్థిరపడ్డారు. కేశవ్ మహారాజ్ తండ్రి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కుటుంబం డర్బన్‌లో నివసిస్తున్నప్పటికీ, ఇప్పటికీ భారతదేశ సంస్కృతిని నమ్ముతున్నామని, అన్ని పండుగలను జరుపుకుంటామని, కేశవ్ మహారాజ్ సోదరి తరిష్మా శ్రీలంక పౌరుడిని వివాహం చేసుకున్నారని పేర్కొన్నాడు. కేశవ్ మహారాజ్ గురించిన మరో విశేషమేమిటంటే, అతనికి 2 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, అతను దక్షిణాఫ్రికాలోనే కిరణ్ మోర్‌ను కలిశాడు. మహారాజ్ ఏదో ఒక రోజు దక్షిణాఫ్రికా తరపున ఆడతాడని ఆ సమయంలో కిరణ్ మోరే ఊహించాడు. అదే నిజమైంది.

విరాట్ కోహ్లీని 2 సార్లు ఔట్ చేశాడు..
వన్డే సిరీస్‌లో కేశవ్ మహరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేశవ్ మహరాజ్ వన్డే సిరీస్‌లో కేవలం 3 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. కానీ, విరాట్ కోహ్లీ వికెట్‌ను రెండుసార్లు పడగొట్టాడు. పార్ల్‌లో జరిగిన రెండో వన్డేలో విరాట్‌ను సున్నాకే పెవిలియన్ చేర్చాడు. మూడో మ్యాచ్ లోనూ విరాట్ ను తన స్పిన్‌తో ఇబ్బందుల్లోకి నెట్టి దక్షిణాఫ‌రికా విజయానికి బాటలు వేశాడు. తొలి వన్డేలో శిఖర్ ధావన్ కీలక వికెట్‌ను కేశవ్ మహరాజ్ తీశాడు. కేశవ్ మహారాజ్ వన్డే సిరీస్‌లో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేస్తుంటాడు. 3 మ్యాచ్‌ల్లో ఓవర్‌కు 4.58 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

Also Read: Shoaib Akhtar: టీమిండియాలో ఐక్యత లోపించింది.. అందుకే టెస్టు, వన్డే సిరీస్ ఓడిపోయారు..

Ravichandran Ashiwn: వన్డే జట్టులోకి అశ్విన్ తిరిగి రావడం వింత.. సంజయ్ మంజ్రేకర్..