
IND vs SA : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 పోరులో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా భారత్‌ను ఓడించింది. 188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, సఫారీ బౌలర్ల ధాటికి నిర్ణీత ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసింది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన భారత్‌కు ఈ టోర్నీలో ఇదే మొదటి ఓటమి. 188 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (0) పరుగులేమీ చేయకుండానే మార్క్రామ్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. ఆ వెంటనే తిలక్ వర్మ (1) కూడా మార్కో జాన్సెన్ వేసిన మొదటి బంతికే అవుట్ కావడంతో భారత్ 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కాసేపు మెరుపులు మెరిపించిన అభిషేక్ శర్మ (15) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సమయానికి భారత్ 31 పరుగులకే 3 ప్రధాన వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత భారత్ బ్యాట్స్‌మెన్ అంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు.111 పరుగులకే టీమ్‌ఇండియా ఆల్ అవుట్ అయింది. 76 పరుగుల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. శివమ్ దూబె (42) భారత బ్యాటర్లలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు