IND vs SA, 3rd Test, Day 2, Highlights: భారత్, దక్షిణాఫ్రికా (India Vs South Africa) జట్ల మధ్య కేప్ టౌన్ (Cape Town Test)లో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌లో నేడు రెండవ రోజు. దక్షిణాఫ్రికా టీం తన తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 13 పరుగుల ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో బుమ్రా 5, ఉమేష్ యాదవ్, షమీ తలో 2 వికెట్లు, శార్దుల్ ఠాకూర్ ఒక వికెట్ పడగొట్టారు. దక్షిణాఫ్రికా టీంలో కీగన్ పీటర్‌సెన్ 72, బవుమా 28, మహరాజ్ 25, డుస్సెన్ 21 పరుగులతో రాణించారు.
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు మరోసారి నిరాశపరచడంతో బాధ్యతలు కెప్టెన్ కోహ్లీ, పూజారా తీసుకున్నారు. నిలకడగా ఆడుతూ జట్టు స్కోరుని పెంచారు. ఈ క్రమంలో పుజారా 77 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 43 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన అజింకా రహానె 9 పరుగులకే ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్‌తో కలిసి కోహ్లీ ఐదో వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం అందించారు. 27 పరుగుల వద్ద పంత్ ఔటయ్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 201 బంతుల్లో 12 ఫోర్లు ఒక సిక్సర్‌తో 79 పరుగులు చేసి తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో 28 హాఫ్ సెంచరీ సాధించాడు. అనంతరం భారత్ 77.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా బౌలర్లలో కాగిసో రబడా 4, జాన్సన్ 3, ఓలివర్ 1, మహరాజ్ 1, ఎంగిడి 1 వికెట్ సాధించారు.
టీమిండియా ప్లేయింగ్ XI: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్యా రహానే, రిషబ్ పంత్(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్
దక్షిణాఫ్రికా ప్లేయింగ్ XI: డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్‌రామ్, కీగన్ పీటర్‌సన్, రాస్సీ వాన్ డెర్ డుస్సెన్, టెంబా బావుమా, కైల్ వెర్రెయిన్నే (కీపర్), మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, డువాన్ ఒలివియర్, లుంగి ఎంగిడి.
రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది. దీంతో భారత్ ఆధిక్యం 70 పరుగులకు చేరింది. అంతకు ముందు దక్షిణాఫ్రికా టీం 210 పరుగులకు ఆలౌట్ అయింది.
ఆరంభంలోనే 2 వికెట్లు కోల్పోయిన భారత్‌ను కెప్టెన్ కోహ్లీ, పుజారా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 50 పరుగులకు చేరుకుంది. దీంతో ఆధిక్యం 63 పరుగులకు చేరుకుంది.
రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారత్‌కు మరో దెబ్బ తగిలింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(7) పెవిలియన్ చేరిన వెంటనే కేఎల్ రాహుల్(10) కూడా ఔటయ్యాడు. జాన్‌సెన్ బౌలింగ్‌లో మాక్రాంకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ ఆధిక్యం 41 పరుగులకు చేరింది. క్రీజులో పుజారా (4), విరాట్ కోహ్లీ (0) ఉన్నారు. ప్రస్తుతం భారత్ 2 వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది.
రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారత్‌కు తొలి దెబ్బ తగిలింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(7) పరుగులకు రబాడ బౌలింగ్‌లో ఎల్గర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ ఆధిక్యం 33 పరుగులకు చేరింది. క్రీజులో పుజారా, కేఎల్ రాహుల్ (10) ఉన్నారు.
దక్షిణాఫ్రికా టీం తన తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 13 పరుగుల ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో బుమ్రా 5, ఉమేష్ యాదవ్, షమీ తలో 2 వికెట్లు, శార్దుల్ ఠాకూర్ ఒక వికెట్ పడగొట్టారు.
దక్షిణాఫ్రికా టీం తొమ్మిదో వికెట్‌ను కోల్పోయింది. ఠాకూర్ బౌలింగ్‌లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి రబాడ(15) పెవిలియన్ చేరాడు. చేర్చాడు. దీంతో దక్షిణాఫ్రికా 200 పరుగుల వద్ద 9వ వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 23 పరుగుల వెనుకంజలోనే నిలిచింది.
మూడో సెషన్ ప్రారంభంలో దక్షిణాఫ్రికా మరో వికెట్‌ను కోల్పోయింది. భారీ ఇన్నింగ్స్ ఆడుతోన్న కీగన్ పీటర్‌సెన్(72)ను బుమ్రా పెవిలియన్ చేర్చాడు. పుజారాకు క్యాచ్ ఇచ్చి ఎనిమిదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో దక్షిణాఫ్రికా 179 పరుగుల వద్ద 8వ వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 44 పరుగుల వెనుకంజలోనే నిలిచింది.
రెండో సెషన్ చివర్లో దక్షిణాఫ్రికా మరో వికెట్‌ను కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో జాన్‌సెన్ (7) బౌల్డయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికా 176 పరుగుల వద్ద ఏడో వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 47 పరుగుల వెనుకంజలోనే నిలిచింది.
షమీ అద్భుతంగా బౌలింగ్ చేసి భారత శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. 56వ ఓవర్లో 2, 4 బంతుల్లో వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను ఇబ్బందుల్లోకి నెట్టాడు. ప్రస్తుతం 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా.. రమో 63 పరుగుల వెనుకంజలోనే నిలిచింది.
కీలక భాగస్వామ్యాన్ని షమీ విడదీశాడు. బవుమా(28), పీటర్‌సేన్(61)లు ఇద్దరు భారత బౌలర్లకు కఠిన పరీక్ష పెడుతూ 47 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించారు. అయితే షమీ బౌలింగ్‌లో బవుమా పెవిలియన్ చేరడంతో భారత శిబిరంలో ఆశలు చిగురించాయి.
సౌతాఫ్రికా బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ స్కోర్‌ను 150 పరుగులు దాటించారు. ఇంకా చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. ప్రస్తుతం సౌతాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆధిక్యాన్ని తగ్గించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పీటెర్‌సెన్ 59, బవుమా 24 పరుగులతో మరో కీలక భాగస్వామ్యాన్ని ఏర్పరిచడంతో భారీ స్కోర్ దిశగా సౌతాఫ్రికా దూసుకెళ్తోంది. ప్రస్తుతం సౌతాఫ్రికా మరో 70 పరుగుల వెనుకంజలోనే ఉంది.
వికెట్ల కోసం భారత బౌలర్లు చెమడోడుస్తున్నారు. సౌతాఫ్రికా బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ భారత బౌలర్లకు కఠిన పరీక్షలు పెడుతున్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆధిక్యాన్ని తగ్గించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పీటెర్‌సెన్ 56, బవుమా 17 పరుగులతో మరో కీలక భాగస్వామ్యాన్ని ఏర్పరిచారు. మరో 80 పరుగుల వెనుకంజలోనే ఉంది.
ఎట్టకేలకు రెండు రివ్యూలు కోల్పోయిన భారత్‌కు ఉమేష్ యాదవ్ కాస్త ఊరటనిచ్చాడు. డుస్సెన్(21) వికెట్‌ను తీసి
భారత శిబిరంలో ఆనందం నింపాడు. దక్షిణాఫ్రికా ఇంకా 111 పరుగుల వెనుకంజలోనే ఉంది. ప్రస్తుతం 4 వికెట్లు నష్టపోయి 112 పరుగులు చేసింది.
తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్స్ రెండో రోజు కొద్దిగా తడబడినా అనంతరం కోలుకుని నిలకడగా రాణిస్తున్నారు. భారత బౌలర్లకు ధీటుగా పరుగులు సాధిస్తూ ఆధిక్యాన్ని తగ్గించేందుకు పోరాడుతున్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 100 పరుగులకు చేరుకుంది. ప్రస్తుతం డుస్సెన్ 17, పీటర్‌సేన్ 40 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా 2, ఉమేష్ యాదవ్ 1 వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికా ఇంకా 123 పరుగుల వెనుకంజలో నిలిచింది.
భారత బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా టీం వరుసగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లోకి జారుకుంటుంది. ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో మహరాజ్(25) బౌల్డయ్యాడు. దీంతో సౌతాఫ్రికా టీం 45 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది.
రెండో రోజు ఆట ప్రారంభంలో దక్షిణాఫ్రికా టీంకు బుమ్రా రూపంలో దెబ్బ తగిలింది. మక్రాం 8 పరుగుల వద్ద బౌల్డ్‌య్యాడు. దీంతో సౌతాఫ్రికా టీం 17 పరుగుల వద్ద రెండోవ వికెట్‌ను కోల్పోయింది.