IND vs SA: ఆ జట్టు మా కళ్లు తెరిపించింది.. లోపమంతా అక్కడే.. త్వరలో సెట్ చేస్తాం: రాహుల్ ద్రవిడ్

IND vs SA 3rd ODI: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడవ, చివరి మ్యాచ్‌లో భారత్ 4 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీంతో వన్డేల్లో టీమిండియా ప్రదర్శనపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

IND vs SA: ఆ జట్టు మా కళ్లు తెరిపించింది.. లోపమంతా అక్కడే.. త్వరలో సెట్ చేస్తాం: రాహుల్ ద్రవిడ్
Rahul Dravid

Updated on: Jan 24, 2022 | 10:47 AM

Rahul Dravid: కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. చివరిదైన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో భారత్‌పై గెలిచి సిరీస్‌ను 0-3 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 49.5 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత జట్టు 49.2 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌటైంది. ఆ లక్ష్యాన్ని ఛేదిస్తున్న టీమిండియా ఆరంభం ఫర్వాలేదనిపించింది. తొలి వికెట్‌ పతనం తర్వాత విరాట్‌ కోహ్లీ, శిఖర్‌ ధావన్‌ హాఫ్‌ సెంచరీలతో జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. అదే సమయంలో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 288 పరుగుల లక్ష్యానికి చేరువైనట్లే అనిపించింది. కానీ, భారత జట్టు 49.2 ఓవర్లలో 283 పరుగులకే కుప్పకూలింది. మ్యాచ్ అనంతరం జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారత ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేశాడు.

రాహుల్ ద్రవిడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, “ఈ సిరీస్ మా కళ్లు తెరిపించింది. వన్డే జట్టుతో ఇది నా మొదటి సిరీస్. చాలా కాలం తర్వాత మేం వన్డేలు ఆడాం. ప్రపంచ కప్ చాలా దూరంలో ఉంది. మాకు సమయం ఉంది. కాలక్రమేణా మేం ఖచ్చితంగా మెరుగుపడతాం” అని పేర్కొన్నాడు.

“మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ చేయడంతో మేం ఖచ్చితంగా మెరుగ్గా రాణించలేదు. మేం టెంప్లేట్‌ను అర్థం చేసుకున్నాం. మధ్యలో బ్యాటింగ్ చేయగలిగిన వారిలో కొందరు ఎంపికకు అందుబాటులో లేరు. వారు తిరిగి జట్టులోకి వస్తే మిడిలార్డర్ బ్యాటింగ్ సమస్యలు తీరుతాయి. దీపక్ చాహర్ ఇంతకు ముందు కూడా బ్యాట్‌తో అతనికి మంచి సామర్థ్యాలు ఉన్నాయని చూపించాడు. తనకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని చూస్తున్నాం. శార్దూల్ ఠాకూర్ కూడా బ్యాట్‌తో బాగా ఆకట్టుకున్నాడు. అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని మేం కోరుకుంటున్నాం” అని రాహుల్ ద్రవిడ్ తెలిపాడు.

రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ, “మేం బ్యాటింగ్ ఆర్డర్‌ను పెద్దగా మార్చలేదు. దీని వెనుక మా ఆలోచన వారికి భద్రత కల్పించడమే. వారికి అవకాశాలు వచ్చినప్పుడు భారీ ప్రదర్శనలు చేస్తారు. కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఆకట్టుకున్నాడు. అతను నేర్చుకుంటూనే ఉన్నాడు. భవిష్యత్తులో మరింతగా రాటుదేలుతాడని భావిస్తున్నాను” అని పేర్కొన్నాడు.

“నేను స్పిన్నర్లను మాత్రమే వదులుకోను. మిడిల్ ఓవర్లలో మా వికెట్ టేకింగ్ సామర్థ్యం పెరగాలి. ఈ ప్రాంతంలో ఎలా మెరుగుపడాలో చర్చిస్తాం” అని మిడిల్ ఓవర్లలో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

Also Read: Watch Video: కోల్‌కతాతో కటీఫ్.. భావోద్వేగానికి గురైన టీమిండియా యంగ్ ప్లేయర్.. వైరలవుతోన్న వీడియో

ICC Women World Cup: ప్రపంచ కప్ తర్వాత రిటైర్మెంట్‌.. భారత వన్డే కెప్టెన్ సమాధానం ఏంటంటే?