IND vs SA: విశాఖ వేదికగా నేడు సౌతాఫ్రికాతో టీమిండియా మ్యాచ్.. డు ఆర్ డై మ్యాచ్‌లో పురువు నిలిచేనా?

|

Jun 14, 2022 | 5:56 AM

IND vs SA: డు ఆర్‌ డై మ్యాచ్‌లో టీమిండియా ఏం చేయబోతోంది? విశాఖ వేదిక జరగబోతున్న మ్యాచ్‌లోనైనా పరువు నిలుపుకుంటుందా?

IND vs SA: విశాఖ వేదికగా నేడు సౌతాఫ్రికాతో టీమిండియా మ్యాచ్.. డు ఆర్ డై మ్యాచ్‌లో పురువు నిలిచేనా?
Ind Vs Sa
Follow us on

IND vs SA: డు ఆర్‌ డై మ్యాచ్‌లో టీమిండియా ఏం చేయబోతోంది? విశాఖ వేదిక జరగబోతున్న మ్యాచ్‌లోనైనా పరువు నిలుపుకుంటుందా? లేక మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్‌ను చేజార్చుకుంటుందా? అనేది ఉత్కంఠగా మారింది. విశాఖ వేదికగా ఇవాళ సౌతాఫ్రికాతో టీమిండియా తలబడబోతోంది. ఇప్పటికే వరుసగా రెండు టీ20ల్లో ఓడిన భారత్‌ పరువు కోసం ఆరాట పడుతుంటే, ఎలాగైనా ఈ మ్యాచ్‌ను కూడా గెలిచి సిరీస్‌ను ఎగరేసుకునిపోవాలని ఉవ్విళ్లూరుతున్నారు సఫారీలు. అటు బ్యాటింగ్‌ ఇటు బౌలింగ్‌లో ఘోరంగా విఫలమైన టీమిండియా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి, అభిమారులతో చీవాట్లు తింటోంది. దాంతో, మూడో టీ20లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కనిపిస్తోంది.

రెండు మ్యాచ్‌ల్లోనూ బ్యాట్స్‌మెన్స్‌ ఫర్వాలేదనిపించినా, బౌలర్లు ఘోరంగా విఫలం అయ్యారు. ముఖ్యంగా స్పిన్ ద్వయం అక్షర్ పటేల్, యుజువేంద్ర చహల్, హార్దిక్ పాండ్యా పేలవ ప్రదర్శనతో రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి తప్పలేదు. దాంతో, ఇవాళ విశాఖ వేదికగా జరిగే మూడో టీ20లో భారీ మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. విశాఖలో మ్యాచ్‌ జరగనుండటంతో సాగర నగరంలో క్రికెట్‌ ఫీవర్‌ కనిపిస్తోంది. అభిమానులంతా ఫుల్‌ జోష్‌తో ఉన్నారు. టికెట్స్‌ అన్నీ హాట్‌ కేకుల్లాగా అమ్ముడైపోయాయి. ఎప్పుడెప్పుడు మ్యాచ్‌ మొదలవుతుందా అని క్రికెట్‌ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అంతేకాదు, టీమిండియాకి కలిసొచ్చే విశాఖ స్టేడియంలో భారత్‌ కచ్చితంగా గెలుస్తుందని అంటున్నారు. మరి, తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఏం చేయబోతోంది? భారత్‌ గెలుస్తుందా? లేక, మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్‌ కోల్పోతుందా? ఇవాళ తేలిపోనుంది.