IND vs PAK : ప్రపంచకప్‌లో భారత్-పాక్ సమరం..రికార్డుల రారాజు టీమిండియాను పాక్ అడ్డుకోగలదా?

IND vs PAK Head to Head Records : ప్రపంచ క్రికెట్‌లో దేనికైనా సాటిరాని అద్భుతం.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్. ఆ రోజు రెండు దేశాల్లోనూ రోడ్లు ఖాళీ అవుతాయి, టీవీల ముందు కోట్లాది మంది ఫ్యాన్స్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చుంటారు. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఈ మహా సంగ్రామం ఫిబ్రవరి 15న శ్రీలంక వేదికగా జరగనుంది.

IND vs PAK : ప్రపంచకప్‌లో భారత్-పాక్ సమరం..రికార్డుల రారాజు టీమిండియాను పాక్ అడ్డుకోగలదా?
Ind Vs Pak

Updated on: Feb 13, 2026 | 11:01 AM

IND vs PAK Head to Head Records : ప్రపంచ క్రికెట్‌లో దేనికైనా సాటిరాని అద్భుతం.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్. ఆ రోజు రెండు దేశాల్లోనూ రోడ్లు ఖాళీ అవుతాయి, టీవీల ముందు కోట్లాది మంది ఫ్యాన్స్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చుంటారు. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఈ మహా సంగ్రామం ఫిబ్రవరి 15న శ్రీలంక వేదికగా జరగనుంది. ఇప్పటికే గ్రూప్-A లో తమ తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి జోరు మీదున్న ఈ రెండు జట్లు, ఇప్పుడు అధికారిక పోరు కోసం సిద్ధమవుతున్నాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వబోతోంది.

శ్రీలంకలో మ్యాచ్‌ ఎందుకు?

టీ20 ప్రపంచకప్ 2026కి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్ తన గ్రూప్ మ్యాచ్‌లను శ్రీలంకలోనే ఆడుతోంది. టీమిండియా3 తన తొలి రెండు మ్యాచ్‌లను (యుఎస్ఏ, నమీబియాపై) భారత్‌లో ఆడి తిరుగులేని విజయాలను అందుకుంది. ఇప్పుడు పాకిస్థాన్‌తో తలపడడానికి భారత జట్టు శ్రీలంకకు చేరుకుంది. దాయాది జట్లు రెండు కూడా ఇప్పటికే రెండేసి విజయాలతో 4 పాయింట్లతో ఉండటం వల్ల, ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా సూపర్ 8 రౌండ్‌కు క్వాలిఫై అవుతుంది.

హెడ్-టు-హెడ్ రికార్డులు

టీ20 ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్‌పై టీమిండియాదే పూర్తి ఆధిపత్యం. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో రెండు జట్లు 8 సార్లు ముఖాముఖి తలపడగా.. భారత్ ఏకంగా 7 సార్లు విజయం సాధించింది. పాకిస్థాన్ కేవలం ఒక్కసారి (2021లో) మాత్రమే గెలవగలిగింది. 2007 ఫైనల్ నుంచి మొన్నటి 2024 వరల్డ్ కప్ వరకు భారత్ నిలకడగా రాణిస్తూ వస్తోంది. ఈ గణాంకాలు చూస్తుంటే ఫిబ్రవరి 15న కూడా భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుందని స్పష్టమవుతోంది.

పిచ్ రిపోర్ట్, టీమ్ బలం

కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఇక్కడ బంతి కొంచెం నెమ్మదిగా వచ్చే అవకాశం ఉండటంతో మధ్య ఓవర్లలో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ లేదా వరుణ్ చక్రవర్తి వంటి స్పిన్నర్లు కీలకం కానున్నారు. మరోవైపు పాకిస్థాన్ పేస్ ద్వయం షాహీన్ ఆఫ్రిది, నసీమ్ షా పవర్‌ప్లేలో వికెట్లు తీయాలని చూస్తారు. అయితే భారత టాప్ ఆర్డర్ ఫామ్‌లో ఉండటం, ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో జట్టు ఐక్యంగా ఉండటం భారత్‌కు ప్లస్ పాయింట్.

షెడ్యూల్, టెలికాస్ట్ వివరాలు

ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ ఫిబ్రవరి 15 (ఆదివారం) నాడు జరుగుతుంది. సాయంత్రం 6:30 గంటలకు టాస్ వేస్తారు. మ్యాచ్ సరిగ్గా రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. టీవీలో చూడాలనుకునే వారు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో, ఆన్‌లైన్‌లో చూడాలనుకునే వారు జియో సినిమా లేదా హాట్‌స్టార్ యాప్స్ లో లైవ్ వీక్షించవచ్చు.

Follow Us