IND vs PAK: టీమిండియా ఫ్యాన్స్‌కు తౌజెండ్ వాలా న్యూస్.. పాక్‌తో మ్యాచ్‌కు యార్కర్ కింగ్ రెడీ.. ఇక దిబిడ దిబిడే..

India vs Pakistan, Asia Cup 2023 Super 4s: అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వచ్చిన తర్వాత బుమ్రా ఇంకా వన్డేల్లో బౌలింగ్ చేయలేదు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌తో తిరిగి జట్టులోకి వచ్చిన బుమ్రా అక్కడ 4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత ప్రారంభమైన ఆసియాకప్‌లో బుమ్రాకు బౌలింగ్‌ చేసే అవకాశం రాలేదు. గతవారం జరిగిన ఆసియాకప్ మూడో మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో భారత్ ఆడినప్పటికీ.. ఆ జట్టుకు బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. ఆ తర్వాత నేపాల్‌తో టీమిండియా తలపడింది.

IND vs PAK: టీమిండియా ఫ్యాన్స్‌కు తౌజెండ్ వాలా న్యూస్.. పాక్‌తో మ్యాచ్‌కు యార్కర్ కింగ్ రెడీ.. ఇక దిబిడ దిబిడే..
Team India Squad

Updated on: Sep 08, 2023 | 3:52 PM

Jasprit Bumrah: పాకిస్థాన్‌తో సూపర్ 4లో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. అయితే, ఈ మ్యాచ్‌ కోసం టీమిండియా మరో బూస్ట్‌ని అందుకుంది. ఇప్పటికే టీంతో చేరిన కేఎల్ రాహుల్‌తో బ్యాటింగ్ విభాగంలో పుష్టిగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే బౌలింగ్ విభాగంలో టీమిండియా స్టార్ యార్కర్ జస్ప్రీత్ బుమ్రా కూడా జాయిన్ అయ్యాడు. తనకు మగబిడ్డ పుట్టడంతో లంక నుంచి మధ్యలోనే ముంబైకి చేరుకున్నాడు. తాజాగా ఇప్పుడు కొలంబోలో జట్టులో చేరాడు. గత వారాంతంలో పాకిస్థాన్‌తో (Ind Vs Pak) మ్యాచ్ ముగిసిన వెంటనే బుమ్రా భారత్‌కు తిరిగి వచ్చాడు. ఆ సమయంలో బుమ్రా మళ్లీ గాయపడ్డాడని పుకార్లు వ్యాపించాయి. అయితే ఆ తర్వాత తన సోషల్ మీడియా ఖాతాలో తండ్రి అయినట్లు వార్తను పోస్ట్ చేసిన బుమ్రా.. ఆ రూమర్స్‌కి తెర దించాడు.

బుమ్రా శుక్రవారం తెల్లవారుజామున కొలంబో చేరుకున్నాడు. సాయంత్రం ప్రాక్టీస్ కోసం జట్టులో చేరనున్నాడు. కాగా, వర్షం కారణంగా టీమిండియా ఇప్పటివరకు ఇండోర్‌లో శిక్షణ తీసుకుంటోంది. వాతావరణ సూచనల ప్రకారం, శుక్రవారం సాయంత్రం కూడా ఎక్కువ వర్షం పడింది.

ఇవి కూడా చదవండి

వన్డేల్లో బౌలింగ్ చేయని బుమ్రా..

అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వచ్చిన తర్వాత బుమ్రా ఇంకా వన్డేల్లో బౌలింగ్ చేయలేదు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌తో తిరిగి జట్టులోకి వచ్చిన బుమ్రా అక్కడ 4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత ప్రారంభమైన ఆసియాకప్‌లో బుమ్రాకు బౌలింగ్‌ చేసే అవకాశం రాలేదు. గతవారం జరిగిన ఆసియాకప్ మూడో మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో భారత్ ఆడినప్పటికీ.. ఆ జట్టుకు బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. ఆ తర్వాత నేపాల్‌తో టీమిండియా తలపడింది. అయితే ఆ మ్యాచ్‌లో బుమ్రా ఆడలేదు. కాబట్టి, పాకిస్తాన్‌తో సూపర్ 4 దశ మ్యాచ్ జరిగితే, బుమ్రా అక్కడ బౌలింగ్ చేయడం చూడొచ్చు.

ప్రపంచకప్‌నకు ఇంకా నెల రోజుల సమయం ఉంది. ఈలోపే బుమ్రా తన లయను అందుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈసారి భారత్‌లో ప్రపంచకప్‌ జరుగుతుండగా, బుమ్రా తన బౌలింగ్‌తో ప్రపంచకప్‌‌లో సత్తా చాటాలని కోరుకుంటున్నాడు.

భారత్-పాక్‌కు రిజర్వ్ డే..

భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య సూపర్ 4 దశ మ్యాచ్ గురించి చెప్పాలంటే.. అక్కడి వాతావరణ నివేదిక ప్రకారం.. ఈ మ్యాచ్ కూడా జరగడం అనుమానమే. కొలంబోలో సెప్టెంబర్ 10న వాతావరణ సూచన ప్రకారం. 90 శాతం వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పాటు ఇక్కడ జరిగే టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లు కూడా వాష్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. అయితే, ఇలాంటి క్రమంలో ఏసీసీ అభిమానులకు శుభవార్తను అందించింది. దాయాదుల పోరుకు రిజర్వ్ డే ఉంచినట్లు పేర్కొంది. నిర్ణీత రోజున మ్యాచ్ పూర్తి కాకుంటే, రిజర్వ్ డేన ఫలితం తేల్చాలని నిర్ణయించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..