World Cup 2023: క్రికెట్ దేవుడికి గోల్డెన్ టిక్కెట్.. ప్రపంచకప్‌నకు ప్రత్యేకంగా ఆహ్వానించిన బీసీసీఐ సెక్రటరీ జైషా..
ICC ODI World Cup 2023: ప్రపంచకప్ 2011లో గెలిచిన భారత జట్టులో భాగమైన సచిన్ టెండూల్కర్ 2015 ప్రపంచకప్‌కు అంబాసిడర్‌గా కూడా ఉన్నాడు. అలాగే, నాలుగేళ్ల తర్వాత జరిగిన 2019 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ మ్యాచ్ అవార్డు వేడుకకు హాజరైన టెండూల్కర్.. ఆ ఎడిషన్‌లో రన్నరప్ జట్టుగా నిలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును అందించాడు.

వన్డే ప్రపంచ కప్ (ICC ODI World Cup 2023) వచ్చే నెల నుంచి అంటే అక్టోబర్ 5 నుంచి భారతదేశంలో ప్రారంభమవుతుంది. ఈ క్రికెట్ మోగా టోర్నీని ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని రకాల సన్నాహాల్లో బిజీగా ఉంది. ఈ ప్రపంచ యుద్ధం భారతదేశంలోని 10 వేదికలలో జరగనుంది. ఈ ICC ఈవెంట్‌లో 10 జట్లు తలపడుతున్నాయి. ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి భారత్ ఒంటరిగా ప్రపంచకప్‌నకు ఆతిథ్యం ఇస్తోంది. కాబట్టి ఈ టోర్నీని చిరస్మరణీయంగా మార్చేందుకు బీసీసీఐ అనేక ప్రణాళికలు వేసింది. వాటిలో ఒకటి గోల్డెన్ టికెట్ ఫర్ ఇండియా ఐకాన్స్ స్కీమ్. ఈ పథకం కింద భారతదేశంలోని అనేక మంది దిగ్గజాలకు ఈ ప్రత్యేక ఆహ్వానం అందించబడుతోంది. కొద్ది రోజుల క్రితం BCCI బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కు ఈ గోల్డెన్ టిక్కెట్‌ను అందించగా, తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను గోల్డెన్ టిక్కెట్ ఇచ్చి ప్రపంచకప్‌నకు ఆహ్వానించారు.
అమితాబ్ బచ్చన్‌కి గోల్డెన్ టికెట్..
BCCI తన X(ట్విట్టర్) ఖాతాలో ఈ సమాచారాన్ని పంచుకుంది. భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌కు ప్రపంచకప్ గోల్డెన్ టిక్కెట్‌ను బీసీసీఐ సెక్రటరీ జైషా అందించిన ఫొటోను బీసీసీఐ షేర్ చేసింది. ఈ వారం ప్రారంభంలో BCCI బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌ను టోర్నమెంట్‌కి గోల్డెన్ టికెట్ ఇచ్చి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
2015 ప్రపంచకప్‌నకు అంబాసిడర్‌గా సచిన్..
View this post on Instagram
2011లో ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో భాగమైన సచిన్ టెండూల్కర్ 2015 ప్రపంచకప్‌కు అంబాసిడర్‌గా కూడా ఉన్నాడు. అలాగే, నాలుగేళ్ల తర్వాత జరిగిన 2019 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ మ్యాచ్ అవార్డు వేడుకకు హాజరైన టెండూల్కర్.. ఆ ఎడిషన్‌లో రన్నరప్ జట్టుగా నిలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును అందించాడు.
ప్రపంచకప్ అక్టోబర్ 5 నుంచి ప్రారంభం..
ఈ ఏడాది ప్రపంచకప్ అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లో ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, రన్నరప్ జట్టు న్యూజిలాండ్ ప్రారంభ మ్యాచ్‌లో తలపడనున్నాయి. టోర్నమెంట్ రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో జరుగుతుంది. ఇక్కడ మొత్తం 10 జట్లు లీగ్ దశలో ఒకసారి తలపడతాయి. లీగ్ దశలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. నవంబర్ 19న అహ్మదాబాద్‌లో సెమీ ఫైనల్స్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు టైటిల్ కోసం తలపడతాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








