Suryakumar Yadav : విరాట్, ధోనీలకు కూడా సాధ్యం కాలేదు..టీమిండియా కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన రికార్డు

ఆసియా కప్ 2025లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై టీమిండియా అద్భుతమైన విజయాన్ని సాధించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి, దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌తో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఒక అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

Suryakumar Yadav : విరాట్, ధోనీలకు కూడా సాధ్యం కాలేదు..టీమిండియా కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన రికార్డు
Suryakumar Yadav

Updated on: Sep 15, 2025 | 8:03 PM

Suryakumar Yadav : ఆసియా కప్ 2025లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. దుబాయ్ మైదానంలో 128 పరుగుల లక్ష్యాన్ని భారత్ 25 బంతులు మిగిలి ఉండగానే సులభంగా ఛేదించింది. కెప్టెన్‌గా సూర్యకుమార్‌కు ఇది 24వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్. కెప్టెన్సీలో ఆయన అద్భుతమైన రికార్డు సృష్టించారు. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనిలకు కూడా సాధ్యం కాని రికార్డును సూర్య నెలకొల్పారు.

కెప్టెన్‌గా సూర్య అరుదైన రికార్డు

24 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో కెప్టెన్‌గా కోహ్లీ, ధోని కంటే సూర్యకుమార్ ఎక్కువ విజయాలు సాధించారు. ఇప్పటివరకు ఆయన కెప్టెన్‌గా 19 మ్యాచ్‌లు గెలిచారు. 2023లో తొలిసారిగా భారత జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నారు. మరోవైపు, కోహ్లీ 24 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో కెప్టెన్‌గా 14 మ్యాచ్‌లు మాత్రమే గెలిచారు. అయితే, ఆయన తన కెరీర్‌లో మొత్తం 50 టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి 30 మ్యాచ్‌లు గెలిచారు. కోహ్లీ టెస్ట్, టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుండి ఇప్పటికే రిటైర్ అయ్యారు.

రోహిత్ రికార్డు

అత్యంత సక్సెస్ ఫుల్ కెప్టెన్‌లలో ఒకరైన ఎంఎస్ ధోని 24 టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా కేవలం 11 మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించారు. ధోని తన కెరీర్‌లో మొత్తం 72 టీ20 మ్యాచ్‌లకు నాయకత్వం వహించి, 41 సార్లు విజయం సాధించారు. భారత కెప్టెన్‌గా 24 టీ20 మ్యాచ్‌ల తర్వాత అత్యధిక విజయాలు సాధించిన రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. ఆయన 20 మ్యాచ్‌లు గెలిచారు. రోహిత్ తన కెరీర్‌లో మొత్తం 62 టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి, 49 సార్లు విజయం సాధించారు. భారత జట్టుకు అత్యధిక టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు గెలిచిన కెప్టెన్ రోహితే. టీ20 ప్రపంచ కప్ 2024 గెలిచిన తర్వాత రోహిత్ కూడా టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఆయన భారత వన్డే జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతున్నారు.

పాకిస్థాన్‌పై సూర్య అద్భుత ప్రదర్శన

భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్‌లో సూర్యకుమార్ కెప్టెన్‌గానే కాకుండా, బ్యాటింగ్‌లో కూడా అద్భుతమైన ముద్ర వేశారు. 37 బంతుల్లో అజేయంగా 47 పరుగులు చేశారు. ఇందులో ఐదు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. చివరిలో సిక్స్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..