Viral Video: భారత్‌-పాక్‌ పోరంటే ఇలాగే ఉంటది మరి.. కత్తులు దూసుకున్న బుడ్డొళ్లు.. నెట్టింట్లో వైరల్‌ వీడియో

| Edited By: Ravi Kiran

Aug 29, 2022 | 6:39 AM

Ind Vs Pak, Asia Cup 2022: భారత్‌, పాక్‌ జట్ల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ అంటే ఎలాంటి ఉత్కంఠ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టెస్ట్‌, వన్డే, టీ20.. ఏ ఫార్మాట్‌ అయినా ఉత్కంఠతో పాటు భావోద్వేగాలు తారాస్థాయిలో ఉంటాయి. ఇరుజట్ల అభిమానులు తమ జట్టు

Viral Video: భారత్‌-పాక్‌ పోరంటే ఇలాగే ఉంటది మరి.. కత్తులు దూసుకున్న బుడ్డొళ్లు.. నెట్టింట్లో వైరల్‌ వీడియో
Ind Vs Pak
Follow us on

Ind Vs Pak, Asia Cup 2022: భారత్‌, పాక్‌ జట్ల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ అంటే ఎలాంటి ఉత్కంఠ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టెస్ట్‌, వన్డే, టీ20.. ఏ ఫార్మాట్‌ అయినా ఉత్కంఠతో పాటు భావోద్వేగాలు తారాస్థాయిలో ఉంటాయి. ఇరుజట్ల అభిమానులు తమ జట్టు గెలవాలని ప్రార్థనలు, పూజలు చేసిన సందర్భాలున్నాయి. ఈక్రమంలో దుబాయి వేదికగా జరుగుతున్న ఆసియాకప్‌లో మరోసారి భారత్‌-పాకిస్తాన్‌ జట్లు తలపడ్డాయి. ఈనేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ (Wasim Jaffer) తన ట్విటర్‌లో షేర్ చేసిన ఓ వీడియో నవ్వులు పూయిస్తుంది. ఇందులో ఇద్దరు బుడ్డోళ్లు ఉంటారు. ఒకడు పాకిస్తాన్‌కు చెందినవాడు కాగా మరొక బుడ్డోడు టీమిండియా అభిమాని. మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో నువ్వా- నేనా అన్నట్లు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటారు. వీరికి మధ్యలో ఉన్న ఒక వ్యక్తి వారిని శాంతపరిచేందుకు ప్రయత్నిస్తుంటాడు. కానీ ఆ బుడ్డోళ్లు అస్సలు తగ్గరు. సదరు వ్యక్తిని కనీసం లెక్క కూడా చేయరు.. దాయాది జట్ల మధ్య మ్యాచ్‌ అంటే ఇలాగే ఉంటుందని జాఫర్‌ ఒక చిన్న ఉదాహరణతో ఇలా వివరించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

దుబాయి వేదికగా జరుగుతున్న ఈ హై వోల్టేజ్‌ మ్యాచ్‌లో అందరి దృష్టి టీమిండియా రన్‌ మెషిన్‌ విరాట్‌ కోహ్లీ పైనే ఉంది. సెంచరీ చేసి సుమారు నాలుగేళ్లు కావొస్తుండడం.. అదేవిధంగా అతనికిది వందో టి20 కావడంతో కోహ్లిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా తరపున మూడు ఫార్మాట్లలో వంద మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా కోహ్లి చరిత్ర సృష్టించాడు. మరి ఈ వందో మ్యాచ్‌లోనైనా విరాట్‌ రాణించాలని అతని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..