సండే బిగ్ డే..! దాయాది దేశాల పోరులో ‘ఛాంపియన్స్’ ఎవరు..?

భారత్ చివరగా పాకిస్థాన్ లో 2008 ఆసియా కప్ ఆడింది. 2009లో ముంబై లో ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి భారత్.. పాక్ వెళ్లడం లేదు. పాక్ ను కూడా భారత్ ఆహ్వానించడం లేదు. తటస్థ వేదికలపైనే తలపడుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ వేదికగా మరోసారి సమరానికి సిద్ధమయ్యాయి. ఈ ఆదివారం మధ్యాహ్నం నుంచి అప్రకటిత కర్ఫ్యూ నడవబోతోంది. హైదరాబాద్‌లోనో, తెలుగు రాష్ట్రాల్లోనో కాదు.. యావత్‌ దేశంలోనూ ఇదే పరిస్థితి ఉండబోతోంది.

సండే బిగ్ డే..! దాయాది దేశాల పోరులో ‘ఛాంపియన్స్’ ఎవరు..?
Ind Vs Pak In Champions Trophy

Updated on: Feb 22, 2025 | 9:14 PM

ఎన్ని ముఖ్యమైన పనులున్నా.. ఆదివారం మధ్యాహ్నంలోపే చూసుకోండి. వీలైతే వాయిదా వేసుకోండి. సండేనే కదా లేట్‌గా లేద్దాం అని ప్లాన్‌ చేసుకుని ఉంటారేమో..! సరే.. అది మీ ఇష్టం. ఉదయాన్నే టిఫిన్‌ తిన్నా తినకపోయినా ఫర్వాలేదు గానీ.. మధ్యాహ్నం 12, ఒంటిగంట కల్లా భోంచేసేయండి. కాస్త గట్టిగానే తినేయండి. అవసరమైతే.. కావాల్సినన్ని స్నాక్స్‌ తెచ్చిపెట్టుకోండి. మాటిమాటికీ వంట గదిలోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా వాటర్‌ క్యాన్‌నే మీ పక్కన పెట్టుకోండి. వీలైతే.. మజ్జిగో, అప్పుడప్పుడు తాగేందుకు కూల్‌డ్రింక్స్ ప్లాన్‌ చేయండి. ఫోన్లు సైలెంట్‌లో పెట్టండి, వీలైతే స్విచ్‌ ఆఫ్‌ చేయండి. సరిగ్గా మధ్యాహ్నం ఒకటిన్నరకల్లా రెడీ అయిపోండి. ఆదివారం కదా సరదాగా అలా బయటికెళ్దాం అనేం ప్లాన్‌ చేయకండే..! ఈ ఆదివారం మధ్యాహ్నం నుంచి అప్రకటిత కర్ఫ్యూ నడవబోతోంది. హైదరాబాద్‌లోనో, తెలుగు రాష్ట్రాల్లోనో కాదు.. యావత్‌ దేశంలోనూ ఇదే పరిస్థితి ఉండబోతోంది. బయటికెళ్లినా ఏమంత సందడి ఉండదు. ఇంకా కారణం ఏంటో చెప్పాలంటారా. మీ అందరికీ తెలుసుగా..! ఆల్రెడీ ఎవరి ప్రిపరేషన్‌లో వాళ్లు ఉండే ఉంటారుగా..! చాలాకాలం తరువాత దాయాదుల మధ్య జరుగుతున్న మోస్ట్‌ ఎవెయిటింగ్‌ హైఓల్టేజ్‌ మ్యాచ్..! చూడకపోతే ఎలా ఎవరైనా..! మ్యాచ్‌ యాడ్‌ రెవెన్యూ ఎంత? భారత్‌లో క్రికెట్‌ అంటే ఎంత పిచ్చో అందరికీ తెలుసు. పర్టిక్యులర్‌గా ఇలాంటి మ్యాచ్‌ అంటే.. వెర్రి. ప్రపంచానికి ఈ విషయం తెలుసు. అందుకే.. ఈ ఈవెంట్‌ను బాగా క్యాష్‌ చేసుకుంటున్నారు. ఒక్క సెకన్‌ యాడ్‌కు 5 లక్షలట..!...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి